Samantha : నాగచైతన్యతో విడిపోయాక సమంత కొద్ది రోజుల పాటు కాలు బయట పెట్టలేదు. కానీ మొన్నీ మధ్యే ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోలో కనిపించి సందడి చేసింది. అందులో తారక్‌తో కలిసి సమంత సరదాగా పార్టిసిపేట్ చేసింది. అయితే షోలో మునుపటి ఉత్సాహం ఆమెలో కనిపించలేదు. వాడిపోయినట్లు ముఖం కనిపించింది.
ఇక ఇటీవలే సమంత బయట పార్కుల్లో ఆహ్లాదంగా గడుపుతున్నట్లు తెలుస్తోంది. చైతూ నుంచి విడిపోయాక మానసిక ప్రశాంతత కరువైందని, అందువల్లే ఆమె ఆ విధంగా పచ్చని ప్రకృతిలో గడుపుతుందని తెలుస్తోంది.
ఇక ఎవరు మీలో కోటీశ్వరులు షోలో సమంతను ఎన్‌టీఆర్ కొన్ని ప్రశ్నలు అడిగారు. మీ ఫోన్ లో క్విజ్ యాప్స్ ఉంటాయా ? అని తారక్ అడగ్గా.. అందుకు సమంత బదులిస్తూ.. గతంలో ఉండేవని.. కానీ ఇప్పుడు మానసిక ప్రశాంతతను అందించే calming apps ను ఇన్‌స్టాల్ చేశానని.. ప్రస్తుతం వాటినే ఉపయోగిస్తున్నానని సమంత చెప్పింది. అంటే.. ఆమె చైతూ నుంచి విడిపోయాక.. ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు స్పష్టమవుతుంది. కనుకనే ఆమె కామింగ్ యాప్స్ ను వాడుతుందని, పచ్చని ప్రకృతిలో గడుపుతుందని అర్థం చేసుకోవచ్చు.
కాగా తనతో సినిమాలను తీసే దర్శక నిర్మాతలకు కూడా సమంత ఇటీవల కొన్ని కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. తన మూవీ షూటింగ్‌లను వీలైనంత వరకు హైదరాబాద్ లో కాకుండా చెన్నైలోనే ప్లాన్ చేయాలని సమంత వారికి సూచించిందట. ఇక హైదరాబాద్‌లో షూటింగ్ చేయాల్సి వస్తే.. ఔట్ డోర్ కాకుండా ఇండోర్‌లోనే షూటింగ్ చేయాలని కచ్చితంగా చెప్పేసిందట. దీని వల్ల ఫ్యాన్స్ తో అనవసర తలనొప్పి ఎందుకని సమంత భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా విడాకుల అనంతరం ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…