Samantha : విడాకుల తర్వాత కూడా సమంత కెరీర్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. తమిళం, తెలుగు, హిందీ సినిమాలతో బిజీ అవుతున్న సమంత ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ కి సై అంటోంది. తొలి సారి పుష్ప చిత్రం కోసం బన్నీతో కలిసి సమంత స్పెషల్ నంబర్ చేయించబోతుండడం విశేషం. దీంతో ఇప్పుడీ విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.
సమంత స్పెషల్ సాంగ్ కోసం రూ.1.50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. అది కూడా కేవలం నాలుగు రోజులకు మాత్రమే. ఇదే నిజమైతే రికార్డ్ అని చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఐటమ్ సాంగ్స్ చేసిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, తమన్నాలు కూడా ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకోలేదు.
ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న సమంతకు పుష్ప మేకర్స్ ఒక్క సాంగ్‌కే భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
`పుష్ప`లోని ఐదో సింగిల్ చాలా స్పెషల్ గా ఉండబోతుందని, ఆ స్పెషల్ అవసరమైందని, అందుకోసం మరింత స్పెషల్ ని తీసుకొచ్చామని తెలిపారు. సమంత చేస్తున్న తొలి స్పెషల్ సాంగ్ అని, కచ్చితంగా ఇది స్పెషల్‌గా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుందని చెప్పారు పుష్ప మేకర్స్.
అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న `పుష్ప` చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమవుతోంది. ఈ సినిమాని డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు.