Samantha : సినీ ఇండస్ట్రీలో నటీనటులకు, దర్శక నిర్మాతలకు అత్యంత గౌరవమైన పురస్కారం ఆస్కార్. అలాంటి ఆస్కార్ నామినేషన్‌కు నయనతార, విఘ్నేష్ శివన్ ల సినిమా ఎంపికయ్యింది. కూళంగల్ అనే సినిమాను నయనతార, విఘ్నేష్ శివన్ లు నిర్మించారు. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ కు ఇండియా తరఫు నుండి వెళ్ళడంతో సెలెబ్రిటీలంతా వారికి శుభాకాంక్షలు తెలిపారు. లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ లకు సమంత సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది.
అగ్ర కథానాయికగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న నయనతార ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించింది. ఈ సినిమాకు తన కాబోయే భర్త విఘ్నేష్ శివన్ డైరెక్షన్ వహించారు. రీసెంట్ గా ఈ సినిమా ఆస్కార్ పురస్కారాల్లో ఉత్తమ విదేశీ సినిమాల కేటగిరిలో ఇండియా నుండి సెలెక్ట్ అయ్యింది. అలాగే నయన్ కు బాలీవుడ్ సినీ హీరో విక్కీ కౌశల్ కూడా విష్ చేశారు. ఆయన నటించిన సర్దార్ ఉద్దమ్ తో పాటు కుళాంగల్ సినిమా కూడా ఆస్కార్ నామినేషన్స్ కు సెలెక్ట్ అవ్వడం విశేషం అంటూ పొగిడారు.
ఇలాంటి మంచి సినిమాల్ని ఆదరించినందుకు నయన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్స్ ని గెలుచుకుంది. వచ్చే సంవత్సరం 2022 మార్చి 22 న 94 వ అకాడమీ అవార్డ్స్ ని ప్రదానం చేస్తారు. ఈ అవార్డ్స్ వేడుకలను అమెరికా లాస్ ఏంజిల్స్ లో డాల్బి థియేటర్ లో సెలెబ్రేట్ చేస్తారు. ప్రస్తుతం నయనతార బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…