Samantha : అల్లు అర్జున్ పుష్ప మూవీలో సమంత తొలి సారిగా ఐటమ్ సాంగ్‌లో డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఊ అంటావా మామా.. ఊఊ అంటావా.. అంటూ సమంత అలరించింది. అయితే ఈ ఐటమ్ సాంగ్ చేసేందుకు సమంత మొదట వెనుకడుగు వేసింది. చివరి నిమిషం వరకు ఈ సాంగ్‌ను చేయొద్దనే అనుకుంది. కానీ అల్లు అర్జున్ చొరవతో సమంత ఎట్టకేలకు ఐటమ్ సాంగ్ చేసింది.
అయితే ఫిలింనగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సమంత ఇంకో ఐటమ్ సాంగ్ చేయనుందని తెలుస్తోంది. తన రెండో ఐటమ్ సాంగ్ ను చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ చేయనుందని తెలుస్తోంది.
పుష్ప సినిమాకు సమంత వంటి స్టార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ ఎంత ప్లస్ అయిందో అందరికీ తెలుసు. అందుకనే లైగర్ టీమ్ కూడా తమ సినిమాలో సమంతతో ఐటమ్ సాంగ్ చేయించేందుకు ఆలోచిస్తున్నారట. దీంతో మూవీకి మరింత ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ, సమంత గతంలో మహానటి మూవీలో కలసి నటించారు.
విజయ్ దేవరకొండ లైగర్ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారనున్నాడు. హిందీ వెర్షన్‌ను కరన్ జోహార్ సమర్పిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 25న లైగర్ మూవీ విడుదల కానుంది. పూరీ జగన్నాథ్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ దేవరకొండ ఎంఎంఏ ఫైటర్‌గా కనిపించనున్నాడు.
లైగర్ మూవీలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే సమంత ఈ మూవీలో ఐటమ్ సాంగ్ చేస్తుందా.. లేదా.. అన్నది త్వరలోనే తేలనుంది. దీనిపై అధికారిక ప్రకటనను విడుదల చేయనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…