Samantha : టాలీవుడ్ లో చాలామంది హీరో హీరోయిన్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ తరంలో ఆ లిస్ట్ లోకి వస్తారు అక్కినేని నాగ చైతన్య, సమంత. వీరిద్దరూ చాలా ఏళ్ళు ప్రేమించుకొని.. పెళ్లి చేసుకున్నారు. కానీ గత ఏడాది వీరిద్దరూ విడిపోయిన విషయం మనకు తెలిసిందే. కారణాలు ఏమో తెలియదు కానీ.. ఇద్దరి మధ్యలో మనస్పర్థలు రావడం వల్ల వీరు విడిపోయారు అనే వార్తలు వచ్చాయి. చైతూ నుంచి విడిపోయిన తరువాత సమంత సినిమాల్లో బిజీగా మారింది. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ ఈ భామకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.
అయితే డైవర్స్ విషయం ప్రకటించాక తాము ఇక కలవమని అటూ నాగచైతన్య.. ఇటూ సమంత సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కానీ ఈమధ్య చైసామ్ మళ్లీ కలుస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ ఈ జంట మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే నాగ చైతన్య, సమంత పెళ్లి 2 పద్ధతుల్లో జరిగిన విషయం తెలిసిందే. క్రిష్టియన్ పద్దతిలో అలాగే హిందూ పద్దతిలో పెళ్లి చేసుకున్నారు. అందువల్ల వీరు విడిపోయిన తర్వాత నాగ చైతన్య కట్టిన తాళిని సమంత ఏం చేసింది అనే అనుమానం అందరికి కలుగుతుంది.

కానీ ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సమంత డైవర్స్ ప్రకటించిన వెంటనే పెళ్లికి సంబంధించిన వస్తువులన్నింటినీ చైతూ ఫ్యామిలీకి ఇచ్చేసిందట. అత్తగారు పెట్టిన నగలు, చీరెలతో పాటు తదితర వస్తువులను కూడా తిరిగి ఇచ్చేసిందట. ఈ నగల్లోనే చైతూ వారిచ్చిన తాళిని కూడా ఇచ్చేసిందట. కానీ తమ తల్లిగారు ఇచ్చిన తాళి బొట్టును మాత్రం తన వద్దే ఉంచుకుందట. అంటే తాళిబొట్టును ఏం చేయకుండా జాగ్రత్తగా దాచుకుందట. దీంతో చైతూపై సామ్ ప్రేమ ఇంకా తగ్గలేదని కొందరు అంటున్నారు.