Samantha : విడాకుల తర్వాత సమంత తెగ నీతి సూక్తులు భోదిస్తోంది. తన సోషల్ మీడియా వేదికగా వేదాలు వల్లిస్తోంది. కొద్ది రోజుల క్రితం మై మామ్ సెయిడ్ అంటూ ఆమె షేర్ చేసిన కోట్స్ అందరి దృష్టినీ ఆకర్షించాయి. సమాజంలో మనిషి ఎలా ఉండాలి.. ఒక మనిషి తన సొంత విషయాల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అమ్మాయిలు సమాజంలో గౌరవం దక్కించుకునేందుకు అనుసరించాల్సిన పద్దతులు.. ఇలా ఎన్నో రకాలుగా సమంత ఇన్ స్టా స్టోరీల రూపంలో షేర్ చేస్తోంది.
తాజాగా అమ్మాయిల తల్లిదండ్రులకు సలహాలు, సూచనలు ఇస్తూ ఓ పోస్ట్ పెట్టింది సమంత. మీ కూతురు పెళ్లి గురించి కంగారు పడనవసరం లేదు. ఆమెను సమర్థవంతంగా తీర్చిదిద్దండి. ఆమె పెళ్లి కోసం డబ్బులు కూడబెట్టే బదులుగా ఆమె చదువుకు ఆ డబ్బును ఖర్చు చేయండి. ఆమెను పెళ్లికి సిద్దం చేయడానికి బదులుగా ఆమెను ఆమె కోసం సిద్దంగా ఉండేలా చేయండి. ఆమెకు ప్రేమ.. ఆత్మ విశ్వాసం గురించి తెలియజేయండి.. అంటూ నీతులు బోధించింది.
సమంత సినిమాల విషయానికి వస్తే.. ‘కాతువక్కుల రెందు కాదల్’, ‘శాకుంతలం’ చిత్రాలతోపాటు తాజాగా ఆమె మరో రెండు సరికొత్త ప్రాజక్ట్స్‌ని ఓకే చేసింది. మరోవైపు సామ్ మాజీ భర్త చైతూ ‘లవ్‌స్టోరీ’ విజయం అందుకున్న తర్వాత ‘థ్యాంక్ యూ’, ‘బంగార్రాజు’ చిత్రీకరణలతో బిజీ అయ్యారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…