Amazon Prime : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన యూజర్లకు షాకిచ్చింది. వార్షిక సభ్యత్వ రుసుమును పెంచుతున్నట్లు తెలిపింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లు ఇప్పటి వరకు ఏడాదికి రూ.999 చెల్లిస్తే మెంబర్ షిప్ వచ్చేది. దీంతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీలు, సిరీస్‌లు చూసే అవకాశం ఉంటుంది. అలాగే అమెజాన్ సైట్‌లోనూ వస్తువులను ఎలాంటి డెలివరీ చార్జిలు లేకుండా వేగంగా డెలివరీ పొందవచ్చు. అయితే ప్రైమ్ మెంబర్ షిప్ చార్జిని పెంచుతున్నట్లు తెలిపింది.
అమెజాన్ తన ప్రైమ్ మెంబర్ షిప్ సర్వీస్‌ను తొలిసారిగా 2016లో లాంచ్ చేసింది. అప్పట్లో రూ.499కు ఏడాది మెంబర్‌షిప్‌ను ఇచ్చారు. 2017లో ఆ రుసుమును రూ.999 చేశారు. ఇప్పటి వరకు అదే రుసుము కొనసాగుతూ వచ్చింది. కానీ దాన్ని రూ.500 మేర పెంచారు. దీంతో ఇకపై యూజర్లు ఏడాదికి రూ.1499 చెల్లించి అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను పొందాల్సి ఉంటుంది.
అయితే కొంతకాలం పాటు పాత చార్జినే వసూలు చేస్తామని అమెజాన్ తెలిపింది. అందువల్ల ప్రస్తుతానికి రెన్యువల్ లేదా కొత్తగా మెంబర్‌షిప్ తీసుకుంటే రూ.999 చెల్లిస్తే చాలు. అయితే ఈ ఆఫర్ ఎన్ని రోజుల వరకు ఉంటుందనే వివరాలను అమెజాన్ వెల్లడించలేదు. కనుక అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ రెన్యువల్ తేదీ దగ్గర పడుతున్నవారు లేదా కొత్తగా మెంబర్‌షిప్ తీసుకోవాలని అనుకుంటున్నవారు ఇప్పుడే ఆ మెంబర్‌షిప్‌ను తీసుకుంటే మంచిది. దీంతో రూ.500 ఆదా చేయవచ్చు.
ఇక 18 నుంచి 24 ఏళ్ల వయస్సు ఉన్నవారికి ప్రైమ్ యూత్ ఆఫర్ ను అందిస్తున్నారు. ఈ క్రమంలో ఈ వయస్సు ఉన్న యూజర్లు వార్షిక సభ్యత్వం తీసుకుంటే రూ.500, 3 నెలల మెంబర్‌షిప్ తీసుకుంటే రూ.165 క్యాష్‌బ్యాక్ ఇస్తారు.
కాగా అమెజాన్ ప్రైమ్‌కు చెందిన నెలవారీ, 3 నెలల, వార్షిక మెంబర్‌షిప్ ప్లాన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
* నెల వారీ ప్లాన్ – పాత చార్జి రూ.129, కొత్త చార్జి రూ.179
* 3 నెలల మెంబర్‌షిప్ – పాత చార్జి రూ.329, కొత్త చార్జి రూ.459
* ఏడాది మెంబర్‌షిప్ – పాత చార్జి రూ.999, కొత్త చార్జి రూ.1499
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…