Samantha : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ నాగ చైతన్య, సమంత గత ఏడాది అక్టోబర్ 2న తమ విడాకుల విషయం ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చారు. వీరు తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ షాకయ్యారు. అక్కినేని నాగచైతన్య, సమంత ఇద్దరూ ఇష్టపడి పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ 2021 మే నెల నుంచి వారిద్దరూ విడిపోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. దాదాపు మూడు, నాలుగు నెలల ప్రచారం అనంతరం నాగచైతన్య, తాను అధికారికంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము.. అంటూ సమంత తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
అప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉంటూ వచ్చిన వారిద్దరూ ఉన్నట్లుండి విడిపోతున్నామంటూ ప్రకటించడంపై ఫ్యాన్స్ సహా సినీ లోకం ఆశ్చర్యపోయింది. అయితే వారిద్దరూ ఎందుకు విడిపోతున్నారో ఎక్కడా బయటకు చెప్పలేదు. విడిపోయిన తర్వాత ఇద్దరూ వారి వారి లైఫ్‌లను లీడ్ చేస్తున్నారు. ఎక్కడా ఒకరిపై మరొకరు బహిరంగంగా విమర్శలు చేసుకోలేదు. చైతూ నుండి విడిపోయిన తర్వాత సమంత ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేసిందే తప్ప ఎక్కడ కూడా చైతూ గురించి మాట్లాడింది లేదు. కానీ తాజాగా తన ఇన్‌స్టా పోస్ట్‌లో మజిలీ పోస్టర్ షేర్ చేస్తూ.. మజిలీకి 3 ఏళ్లు అంటూ తెలిపింది.
పోస్టర్‌లో చైతూ సీరియస్ లుక్‌లో కనిపిస్తుండగా.. పైన కనిపిస్తున్న వాటిలో ఇద్దరూ చాలా ఆప్యాయంగా కనిపిస్తున్నారు. ఆటోనగర్ సూర్య, మనం తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించిన చిత్రం మజిలీ. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన మజిలీ విమర్శకులు, ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది. అనుకోని పరిస్థితుల కారణంగా విడిపోయిన ఓ జంట చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చైతూ తన బెస్ట్ పెయిర్ సమంత అని చెప్పిన విషయం తెలిసిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…