సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది సమంత. పెళ్లి తర్వాత కూడా సాధారణ అమ్మాయిలా కాకుండా నిత్యం ట్రెండీ ఫ్యాషన్ దుస్తులను ధరిస్తూ.. వాటిని ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్లోనూ షేర్ చేసుకుంటూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకుంటుంది సమంత. ప్రస్తుతం సామ్ నేషనల్ లెవెల్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2తో సమంతకు ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే.. అలాగే పుష్పలోని ఐటం సాంగ్ ఊ అంటావా మామ అనే పాట వరల్డ్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది.
అయితే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతకు సంబంధించి వస్తున్న పుకార్లు అన్నీ ఇన్నీ కావు. ఆమె గురించి రోజుకో వార్త పుట్టుకొస్తుంది. సమంత రెండో వివాహానికి సిద్ధమైంది అన్నట్లుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. తమిళనాడుకు చెందిన ఒక వ్యాపారవేత్తను ఆమె రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందని, దీనికి ఆమె విశ్వసించే ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ కారణమని తెలుస్తోంది. సమంత విడాకుల సమయంలో ఆయన సమంతకు ఆధ్యాత్మికంగా కొన్ని మంచి విషయాలు చెప్పి ప్రేరేపించారని, దీంతో సమంతకు రెండో వివాహం చేసుకోవాలని కూడా ఆయనే సలహా ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.
అయితే ఇవన్నీ పుకార్లేనని.. అసలు సమంత పెళ్లికి సద్గురుకి సంబంధమే లేదని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సామ్ అనారోగ్య కారణాలు ఉండటంతో.. వాటి నుంచి కోలుకున్నాక ఫుల్ ఫోకస్ సినిమాలపై పెడుతుందట. పెళ్లి గురించి ఆలోచనే లేదని అంటున్నారు. అవన్నీ గాసిప్స్ మాత్రమే అని సమంత సన్నిహితులు కొట్టి పారేస్తున్నారు. ఇక సమంత నటించిన శాకుతలం, యశోద సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అలాగే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ఖుషి మూవీలో కూడా సమంత నటిస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…