పవన్ కళ్యాణ్.. చిరంజీవి తమ్ముడుగా పరిశ్రమలోకి వచ్చినా.. ఒక తరుణంలో పవన్ కళ్యాణ్ అన్నయ్యే చిరంజీవి అనిపించుకున్న స్టార్. భిన్నమైన ఆలోచనా ధోరణి ఉన్న పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్నో భారీ విజయాలున్నాయి. అతను సాధించిన విజయాలన్నీ ట్రెండ్ సెట్ చేసినవే. ఈ కారణంగానే అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఒకవైపు నటన చేస్తూనే.. దర్శకుడుగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం జనసేన పార్తీ పెట్టి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. అతనిపై ఎలాంటి రాజకీయ మచ్చలు లేకపోవడంతో తన వ్యక్తిగత జీవితంపై ప్రత్యర్థులు టార్గెట్ చేస్తూ వచ్చారు.
ముఖ్యంగా పవన్ పెళ్ళిల విషయంపైనే ప్రత్యర్థి పార్టీలు ఎక్కువగా విమర్శలు చేసారు. 3 పెళ్లిళ్లు చేసుకున్నాడంటూ పదేపదే పవన్‌ను కించపరుస్తూ వచ్చాయి. ఇక పవన్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. పవన్ 1995లో విశాఖకు చెందిన నందిని అనే అమ్మాయిని మెుదటిగా వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. కొద్ది రోజుల తర్వాత ఇద్దరి మధ్య గొడువలు రావడం.. చివరకు అది విడాకులకు దారి తీసింది. నందిని.. వవన్‌పై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. తర్వాత 2008లో నందిని నుంచి పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్నాడు.
నందిని విషయానికి వస్తే పవర్ స్టార్‌తో విడాకుల తర్వాత తన పేరును జాహ్నవిగా మార్చుకుంది. 2010లో డాక్టర్ కృష్ణారెడ్డిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది. అక్కడే భర్తతో తన జీవితాన్ని సంతోషంగా సాగిస్తుంది. ఇక పవన్ బద్రి సినిమాలో తనతో హీరోయిన్‌గా చేసిన రేణు దేశాయ్‌తో సహజీవనం చేశాడు. వారికి ఇద్దరూ పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఆమెను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత రేణు దేశాయ్‌తో కూడా విడిపోయి రష్యన్ నటి అన్నా లెజినోవాని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…