Samantha : ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ సమంత. కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ టాప్ రేంజ్‌కి వెళ్లింది. ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది సమంత. ఇందులో రాజీ అనే ఎల్‌టీటీఈ రెబెల్ పాత్రలో అద్భుత నటనను కనబర్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సిరీస్ కూడా సూపర్ హిట్ కావడంతో సామ్ కు బాలీవుడ్‌లోనూ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌ను తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే దర్శకత్వంలోనే మరో వెబ్‌సిరీస్‌కు పచ్చ జెండా ఊపింది.

బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో స్పై థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌లో సమంత కనిపించనుంది. మార్వెల్ సినిమాల రూపకర్తలు రూసో బ్రదర్స్ హాలీవుడ్ లో సిటాడెల్ పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమాకు ఇండియన్ వెర్షన్ నే వెబ్ సిరీస్‌గా రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్నారు. అయితే సమంత మరో బాలీవుడ్ ప్రాజెక్ట్‌కి సైన్ చేసినట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ రాబోయే ప్రాజెక్ట్‌లో హీరోయిన్ గా నటించడానికి సమంత అంగీకరించినట్లు తెలుస్తోంది.
కుమార్ మంగత్ ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించాలని భావిస్తున్నారు. ఈ సినిమా నటీనటులు, ఇతర వివరాలకి సంబంధించి త్వరలో ప్రకటన రానుంది. సమంత పేరు ఇటీవలి కాలంలో బాగా వినిపిస్తోంది. వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. పుష్ప చిత్రంలో ఐటమ్ సాంగ్‌తో ఒక్కసారిగా సంచలనం సృష్టించిన ఈ చిన్నది అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్‌ను బాగా అట్రాక్ట్ చేసింది. ఈ పాటతో మొదలైన సమంత సినిమాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే తెలుగులో యశోద, శాకుంతలమ్ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్న సామ్ బీటౌన్‌లోనూ తన సత్తా చాటుతోంది.