Samantha : అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత నుంచి సమంత జోరు పెంచింది. వరుస సినిమాలకు ఓకే చెబుతోంది. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడంతో సమంతకు ఐటమ్ సాంగ్ ఆఫర్లు కూడా వస్తున్నాయి. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్.. అనే తేడా లేకుండా సమంత తనకు వచ్చిన ప్రతి ఆఫర్‌కు ఓకే చెబుతోంది. ఓ వైపు సినిమాలు.. మరో వైపు ఐటమ్ సాంగ్స్.. మధ్య మధ్యలో బ్రాండ్ల ప్రమోషన్ల పోస్టులు.. వెకేషన్లు.. ఇలా సమంత ఫుల్ బిజీగా మారింది. అలాగే వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తోంది. ఇక తాజాగా సమంత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కోలీవుడ్‌లో సమంతకు ఓ సినిమాలో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో కార్తీ పక్కన సమంతను హీరోయిన్‌గా ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే సమంత సదరు సినిమా నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి తమిళ మూవీ బ్యాచిలర్ ఫేమ్.. సతీష్ సెల్వకుమార్ దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించి స్క్రిప్ట్ కూడా రెడీగానే ఉన్నట్లు తెలుస్తోంది. సమంత ఓకే చెబితే.. వెంటనే షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇందులో కార్తీ పక్కన సమంత నటిస్తుందని అంటున్నారు. ఆమెకు ఈ ఆఫర్‌కు ఓకే చెప్పిందని కూడా సమాచారం. ఈ క్రమంలోనే ఈ విషయంపై అధికారికంగా త్వరలోనే వివరాలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
Samantha : సమంత ఫుల్ బిజీ..
ఇక సమంత ప్రస్తుతం యశోద అనే సినిమాలో నటిస్తోంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి, హరీష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే మూవీని సమంత ఇప్పటికే పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.
అలాగే ఓ బాలీవుడ్, మరో హాలీవుడ్ సినిమాలోనూ సమంత నటించనుంది. మరో వెబ్ సిరీస్‌లో నటించేందుకు కూడా ఈమె సిద్ధమవుతోంది. ఇక విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాలో సమంతకు ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై కూడా త్వరలోనే వివరాలను వెల్లడించనున్నారు. మొత్తంగా చూస్తే సమంత విడాకుల తరువాతే ఫుల్ బిజీగా మారిందని చెప్పవచ్చు.