Samantha : సమంత సౌత్ లో ప్రస్తుతం తిరుగులేని స్టార్. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే హీరోయిన్స్‌లో సమంత ఒకరు. సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటారామె. బ్రాండ్ ప్రమోషన్స్‌లోనూ సమంత ముందుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం సమంత సోషల్ మీడియాకి దూరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. సమంత నటించిన కన్మణి రాంబో ఖతీజా చిత్రం ఇటీవల విడుదలయింది.
ఇక యశోద, శాకుంతలం, ఖుషి లాంటి చిత్రాల్లో సమంత నటిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది సమంత. ఈ సిరీస్ లో బోల్డ్ గా నటించి ఫిదా చేసింది. ఇదిలా ఉండగా సమంత ఏం మాయ చేశావె సినిమా చేసిన సమయంలోనే చైతూతో స్నేహం ఏర్పడింది. అనంతరం కొంతకాలం ప్రేమించుకొని, వివాహబంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. కొంతకాలానికి విడిపోతున్నట్టు అందరికీ షాక్ ఇచ్చారు. నాలుగేళ్ల కాపురం తర్వాత గతేడాది వీరు విడిపోయిన విషయం తెలిసిందే. ఇక విడాకుల తరువాత కూడా సమంత జోష్ ఏమాత్రం తగ్గలేదు.

పుష్ప సినిమాలో ఊ అంటావా అంటూ ఐటమ్ సాంగ్ స్టెప్పులు వేసి కుర్రాళ్ల మతిపోగొట్టింది. ఇదిలా ఉంటే సమంత ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అవుతున్నట్టుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. చైతూతో విడాకుల అనంతరం తాను ఒంటిరిగానే ఉండాలని సమంత అనుకున్నప్పటికీ ఆమె తల్లి మాత్రం ఇందుకు ఒప్పుకోవడం లేదట. కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలని చెబుతోందట. దాంతో సమంత కూడా ఆమె మాటకు గౌరవం ఇస్తూ రెండో పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే.