Samantha : నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించిన తరువాత నుంచి సమంత తన కెరీర్‌లో గతంలో ఎన్నడూ లేనంత బిజీగా మారిందని చెప్పవచ్చు. ఓ వైపు సినిమాలు, మరోవైపు సిరీస్‌లు.. ఇంకోవైపు ప్రమోషన్స్.. బ్రాండ్లకు యాడ్స్.. ఫొటోషూట్స్.. తీరిక దొరికితే వెకేషన్స్.. ఇలా సమంత చాలా బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే ఈమెకు ప్రస్తుతం తెలుగులోనే కాక పలు ఇతర భాషల్లోనూ చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఈ మధ్యే విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి అనే సినిమాను ఈమె ప్రారంభించింది. ఇలా వరుస సినిమాలతో సమంత బిజీగా ఉంది. అయితే ఈమెకు హిందీలో ప్రస్తుతం అనేక ఆఫర్లు వస్తున్నాయట. కానీ వాటికి ఆమె నో చెబుతోందని తెలుస్తోంది.
హిందీలో సమంతకు ప్రస్తుతం అనేక సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. అయితే వాటిని సమంత అంగీకరించడం లేదట. అందుకు కారణం కూడా లేకపోలేదు. సమంతకు వస్తున్న ఆఫర్లలో చాలా వరకు సెకండ్ హీరోయిన్ ఆఫర్లేనట. దీంతో ఆమె వాటిపట్ల పెద్దగా ఆసక్తిని చూపించడం లేదని తెలుస్తోంది. కేవలం మెయిన్ రోల్‌లో హీరోయిన్ గా ఆఫర్ వస్తేనే చేస్తా.. అని మేకర్స్‌కు ఈమె కచ్చితంగా చెబుతోందట. ఇక అలా అయినా సరే కొందరు బాలీవుడ్ నిర్మాతలు ఈమెతో సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో సమంత ఒకేసారి 2 లేదా 3 బాలీవుడ్ సినిమాలపై ప్రకటన చేస్తుందని తెలుస్తోంది. అదే జరిగితే ఈమె మరింత బిజీగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక సమంత నటించిన యశోద అనే సైన్స్ ఫిక్షన్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టులో రిలీజ్ కానుంది. ఈ మూవీ నుంచి సమంతకు చెందిన టీజర్‌ను ఇటీవలే లాంచ్ చేయగా.. అది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై అంచనాలు కూడా రోజు రోజుకీ పెరుగుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…