Chethana Raj : ప్రస్తుత తరుణంలో అందం పట్ల చాలా మంది ఎంత శ్రద్ధ వహిస్తున్నారో అందరికీ తెలిసిందే. అందంగా కనిపించేందుకు కేవలం స్త్రీలు మాత్రమే కాదు.. పురుషులు కూడా తాపత్రయ పడుతున్నారు. అందులో భాగంగానే బరువు తగ్గించే శస్త్ర చికిత్సలతోపాటు ముఖం ఇతర శరీర భాగాలు అందంగా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించుకుంటున్నారు. అయితే ఈ సర్జరీలు కుదిరితే బాగానే ఉంటాయి. కానీ కుదరకపోతే ముఖం లేదా శరీరం అంద విహీనంగా మారుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోతాయి కూడా. గతంలో కొందరు నటీనటులకు ఇలాగే జరిగింది. ఇక తాజాగా ఓ నటి కూడా ఇలాగే అందంగా కనిపించడం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. కానీ సర్జరీ వికటించి కొన్ని గంటల్లోనే మృతి చెందింది. వివరాల్లోకి వెళితే..
కన్నడ టీవీ నటి చేతనా రాజ్ ఆ భాషలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది. ఈమె వయస్సు 21 ఏళ్లు. అయితే చేతనా చర్మం కింద ఉండే కొవ్వును కరిగించే ఫ్యాట్ ఫ్రీ కాస్మొటిక్ సర్జరీ చేయించుకుంది. అందుకుగాను ఆమె మే 16న బెంగళూరులోని శెట్టి సౌందర్య హాస్పిటల్‌లో చేరింది. దీంతో ఆమెకు వైద్యులు సర్జరీ చేశారు. అయితే సర్జరీ మధ్యాహ్నం జరగ్గా సాయంత్రం వరకు ఆమె ఊపిరితిత్తుల్లోకి బాగా నీరు చేరింది. దీంతో ఆమె అస్వస్థతకు గురైంది.
ఈ క్రమంలోనే సదరు హాస్పిటల్‌లో ఐసీయూ లేక ఆమెను సమీపంలోని మంజునాథ్ నగర్‌లో ఉన్న కడే హాస్పిటల్‌కు అత్యవసర చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ క్రమంలోనే ఆమె తల్లిదండ్రులు సదరు శెట్టి సౌందర్య హాస్పిటల్‌పై ఆరోపణలు చేస్తున్నారు. సరైన పరికరాలు లేకుండానే ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ చేశారని.. కనుకనే సర్జరీ వికటించి తమ కుమార్తె చనిపోయిందని వారు అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…