Samantha : విడాకుల వ్యవహారం వల్ల సమంత చాలా నలిగిపోయింది. సామ్‌ని ముద్దాయిగా చిత్రీకరిస్తూ ఆమెని చాలా మంది దూషించారు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతోంది. విడాకులకు ముందు సినిమాలకు బ్రేక్ ఇచ్చి పిల్లలను కనాలని భావించిన సామ్ ఇప్పుడు వరుస ప్రాజెక్ట్‌లకి గ్రీన్ సిగ్నల్ ఇస్తోందట. తాజాగా సమంతకు సంబంధించిన ప్రాజెక్ట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.
ఎస్ఆర్ ప్రభు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కోసం సమంత పని చేయనుండగా, ఇంకా పేరు పెట్టని బైలింగ్యువల్ మూవీకి శాంతరూబన్ జ్ఞానశేఖరన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం డిఫరెంట్ లవ్ స్టోరీగా ఉంటుందని తెలుస్తోంది. పెళ్లైన తర్వాత ఓ బేబీ, మజిలీ, యూ టర్న్ వంటి చిత్రాలలో తన అద్భుతమైన నటనతో అందరినీ మంత్రముగ్ధులను చేసిన సామ్ ఇప్పుడు లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను మరి కొద్ది రోజులలో వెల్లడించనున్నారు.
We are happy to announce that @Samanthaprabhu2 is on board for our next! Directed by @Shantharuban87. #ProductionNo30 pic.twitter.com/aV4kyvlJ5Z
— DreamWarriorPictures (@DreamWarriorpic) October 15, 2021
‘ఫ్యామిలీ మ్యాన్-2’ అనంతరం సామ్‌కి బీటౌన్ నుంచి ఎన్నో భారీ అవకాశాలు వచ్చినప్పటికీ.. ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకుని గతంలో వాటంన్నిటినీ వద్దనుకుందని ఆమె స్నేహితురాలు చెప్పుకొచ్చింది. అయితే విడాకులు తీసుకున్న తర్వాత సామ్ ఇక సినిమాలతోనే బిజీగా ఉండాలని.. మంచి కథలకు ఓకే చెబుతోంది. బీటౌన్‌లో తెరకెక్కనున్న ఓ ప్రాజెక్ట్‌కి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. పేరు పొందిన దర్శకుడు రూపొందించనున్న ఈ ప్రాజెక్ట్‌కి ప్రముఖ నిర్మాణ సంస్థ డబ్బులు సమకూరుస్తుందట. ఇందులో నటీనటులు ఎవరు ? కాన్సెప్ట్ ఏమై ఉంటుంది ? అనే వార్తలపై త్వరలో క్లారిటీ రావలసి ఉంది.