Samantha Movie OTT : ఈ మధ్య కాలంలో సమంత పలు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉందని చెప్పవచ్చు. నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంత సినిమాలు, సిరీస్‌లతో ఎంతో బిజీగా మారిపోయింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ గ్లామర్ డోసును ఇంకాస్త పెంచింది. ఇటీవలి కాలంలో ఈ అమ్మడు అనేక మ్యాగజైన్‌లకు కవర్ ఫొటోలకు ఇచ్చిన పోజులు వైరల్ అయ్యాయి. దీంతో సమంత అందాల జాతరను చూసి అందరూ షాక్‌కు గురవుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా సమంత హద్దులు చెరిపేస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక సమంత ఈ మధ్య కాలంలో నటించిన కణ్మణి రాంబో ఖతీజా మూవీ నిరాశ పరిచింది. అయితే ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది.
సమంత, నయనతార, విజయ్ సేతుపతిలు ప్రధాన పాత్రల్లో వచ్చిన కణ్మణి రాంబో ఖతీజా మూవీ తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేదు. అసలు తొలి రోజే ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 80 శాతానికి పైగా థియేటర్లలో ఒక్కటంటే ఒక్క టిక్కెట్ కూడా బుక్ కాలేదు. దీంతో సమంత తొలిసారిగా ఇంతటి డిజాస్టర్‌ను మూటగట్టుకుందని చెప్పవచ్చు. అయితే తమిళంలో మాత్రం ఇదే సినిమా హిట్ అయింది. అక్కడ దీన్ని కాతువాకుల రెండు కాదల్ పేరిట విడుదల చేశారు. ఇక ఈ మూవీకి గాను డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. దీంతో ఆ యాప్‌లో ఈ మూవీని మే 27వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే థియేటర్లలో హిట్ కాని ఈ సినిమా ఓటీటీలో అయినా ప్రేక్షకులను అలరిస్తుందా.. లేదా.. అన్నది చూడాలి.

ఇక సమంత తాజాగా విజయ్ దేవరకొండతో కలసి నటిస్తోంది. ఒకప్పటి పవన్ మూవీ ఖుషి టైటిల్ తో సమంత, విజయ్ ల మూవీని లాంచ్ చేశారు. అలాగే ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. అయితే దీనిపై పవన్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఇక ఇదే కాకుండా సమంత శాకుంతలం అనే పౌరాణిక చిత్రంతోపాటు యశోద అనే సైన్స్ ఫిక్షన్ మూవీలోనూ నటిస్తూ.. ఎంతో బిజీగా మారింది.