Samantha : విడాకుల తర్వాత సమంత తన స్పీడ్ పెంచినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగానే వెంటనే తెలుగులో ఒక థ్రిల్లర్ సినిమాకు ఓకే చెప్పిన సమంత తమిళంలో మరొక సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా వరుస సినిమాలతో దూకుడు పెంచిన సమంత ఈ సారి ఏకంగా ఓ హాలీవుడ్ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గతంలో సమంత నటించిన ఓ బేబీ చిత్రాన్ని నిర్మించిన సునీత తాటి నిర్మాణంలో సమంత ఇంటర్నేషనల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
ఫిలిప్ జాన్ దర్శకత్వంలో రచయిత తిమెరి ఎన్ మురారి నవల అయిన “ది అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్” ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో సమంత హీరోయిన్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ఇండియాలో కొంత భాగం చిత్రీకరించగా మరి కొంత భాగాన్ని వేల్స్ లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాత సునీత.. శాకినీ ఢాకినీ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా అనంతరం సమంతతో ఆ హాలీవుడ్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
ఇలా విడాకులు తరువాత సమంత ఏకంగా తెలుగు, తమిళ చిత్రాలే కాకుండా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని అందరూ భావించారు. ఈ క్రమంలోనే టాప్ సీడ్ ప్రొడక్షన్ లో ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రం ద్వారా సమంత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతుందన్న వార్తలు వచ్చినప్పటికీ ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.అ యితే సమంత ఏకంగా హాలీవుడ్ చిత్రాలలో కూడా నటిస్తూ తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకోబోతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…