Samantha : గ్లామర్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ సమంత. ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూనే మరోవైపు కథానాయికగా నటిస్తూ అలరిస్తోంది. సమంత నటించిన శాకుంతలం, యశోద చిత్రాలతోపాటు ఓ తమిళ చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. ఇక సెట్స్ పై పలు చిత్రాలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే సమంత కొత్త మూవీ నేడు గ్రాండ్‌గా లాంచ్ అయింది. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమ 19వ సినిమాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో సమంత కథానాయికగా నటిస్తోంది.
సినిమా లాంచ్‌కి సంబంధించిన పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ కొట్టారు. హరీశ్ శంకర్‌తోపాటు దర్శకులు కొరటాల శివ, బాబీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హీషం అబ్దుల్ హవద్ మ్యూజిక్ అందించనున్నాడు. ఈ నెలలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా లాంచ్‌కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రమైన ఖుషి టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ సినిమా పూజా కార్యక్రమానికి సమంత హాజరు కాకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సాధారణంగా లాంచింగ్ రోజు హీరో, హీరోయిన్స్ తప్పక హాజరు అవుతారు. సమంత ఎందుకు హాజరు కాలేదు అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సమంత ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో బిజీగా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన హాలిడే టూర్‌కి సంబంధించిన పిక్స్ షేర్ చేసింది. విదేశాలలో ఉన్న కారణంగా ఆమె హాజరు కాలేదు. ఇక మజిలీ తర్వాత ఆమె శివ నిర్వాణతో కలిసి పనిచేయడం ఇది రెండవసారి. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరితగతిన రూపొందనుంది.
అయితే థాయ్‌లాండ్‌లో బిజీగా ఉన్న సమంత అక్కడి తన ఫొటోలను షేర్ చేసింది. వాటిల్లోనూ ఈ అమ్మడు అందాలను ఆరబోసింది. ఎద అందాలను చూపిస్తూ మతులు పోగొడుతోంది. విడాకుల అనంతరం సమంత మరీ శృతి మించి గ్లామర్ షో చేస్తుందని చాలా మంది అంటున్నారు. ఇక తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు కూడా అలాగే ఉన్నాయి. దీంతో నెటిజన్లు మళ్లీ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆమె ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…