Ghani Movie : ఇటీవలి కాలంలో సినిమా రిలీజ్ అయిన రెండు మూడు వారాలలోనే ఆ మూవీ ఓటీటీలో విడుదలకి రెడీగా ఉంటుంది. రీసెంట్‌గా విడుదలై బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచిన గని చిత్రం కూడా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. గని అనే సినిమా స్పోర్ట్స్ డ్రామాలో తెరకెక్కగా ఈ సినిమాని కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో వరుణ్ ఫిజిక్ అదిరిందని అంటున్నారు. గనిలో వరుణ్ తేజ్‌కు జోడీగా సాయి మంజ్రేకర్ నటించారు. గెస్ట్ రోల్స్‌లో సునీల్ శెట్టి, ఉపేంద్ర, జగపతి బాబు కూడా నటించారు. ఒక ప్రత్యేకమైన పాత్రలో నదియా కనిపించారు. గని సినిమాను అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మించారు. దాదాపు రూ.35 కోట్లతో ఈ సినిమా తెరకెక్కగా.. బాక్సాఫీస్ వద్ద నిరాశపరచింది.
గని తర్వాత బీస్ట్, కేజీఎఫ్ వంటి రెండు పాన్ ఇండియా సినిమాలు విడుదలవడంతో గని వారంలోపే థియేటర్లలో నుంచి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఏప్రిల్ 22నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఆహా ఈ సినిమా కోసం కొత్త ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. గని థియేట్రికల్ కట్ కి బదులుగా నిర్మాతల కట్ ప్రసారం చేయబడనుంది.
నిర్మాతల కట్.. స్క్రీన్ ప్లే.. థియేట్రికల్ కట్ కంటే కొంచెం భిన్నంగా ఉంటుందని అంటున్నారు. అంతేకాక 10 నిమిషాలు రన్ టైం కూడా పెరగనుందని తెలుస్తోంది. తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించే ప్రయత్నం ఇదని అంటున్నారు. ఇక వరుణ్ తేజ్ నటించిన గని ఫ్లాప్ కావడంతో ఆయన అభిమానులు ఎఫ్ 3పై అంచనాలు పెట్టుకున్నారు. ఎఫ్ 3లో వరుణ్‌కు జంటగా మెహ్రీన్ నటిస్తుండగా.. మరో జంటగా వెంకటేష్, తమన్నాలు నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత కామెడీ ఉంటుందని.. పొట్ట చెక్కలయ్యేలా అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రూపొందించారని.. కనుక ఈ మూవీ హిట్ కావడం ఖాయమని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…