Samantha : సమంత, నయన తార, విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం.. కాతు వాకుల రెండు కాదల్. తమిళంలో నిర్మించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మేకర్స్ 02.02.2022 తేదీన మధ్యాహ్నం 2.22 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే మూవీ విడుదల తేదీని కూడా చెప్పారు.

ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను ఈ నెల 11వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మేరకు దర్శకుడు విఘ్నేష్ శివన్ ట్వీట్ చేశారు. ఇందులో సమంత, నయనతారలు ఖతిజ, కన్మణి పాత్రల్లో నటించారు. పోస్టర్‌ను బట్టి చూస్తే ఈ మూవీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అర్థం అవుతుంది.
కాతు వాకుల రెండు కాదల్ మూవీని సెవెన్ స్క్రీన్ స్టూడియో, విఘ్నేశ్ శివన్‌కు చెందిన రౌడీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇందులో విజయ్ సేతుపతి ర్యాంబోగా కనిపించనున్నారు.
https://twitter.com/VigneshShivN/status/1488798642928373761
కాగా 2021లో సమంత నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. కానీ పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్‌తో ఈమె మెరిసింది. ఇక ఈ ఏడాది ఈమె నటించిన పలు చిత్రాలు వరుసగా విడుదల కానున్నాయి. ఈ మూవీ అనంతరం శాకుంతలం, యశోద చిత్రాలు విడుదల కానున్నాయి. మరి వీటిల్లో ఎన్ని ఆమెకు సక్సెస్‌ను అందిస్తాయో చూడాలి.