Samantha : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సమంతకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్నాక.. తన కెరీర్ పై ఫోకస్ చేసింది ఈ బ్యూటీ. అందుకే ఆ ఒత్తిడి నుండి బయటపడేందుకు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. మరికొన్ని రోజుల్లో తన వరుస సినిమాల రెగ్యులర్ షూటింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫ్రీ టైమ్ ని తన బెస్ట్ ఫ్రెండ్, ఫేమస్ డిజైనర్ శిల్పారెడ్డితో కలిసి ఆధ్యాత్మిక ప్రాంతాల్ని విజిట్ చేస్తోంది.
వీటికి సంబంధించిన ఫోటోల్ని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసుకుంటోంది. ఫైనల్ గా తన వండర్ ఫుల్ జర్నీ ముగిసింది.. అంటూ పోస్టులు పెడుతోంది సమంత. అలాగే తన ఫ్రెండ్ శిల్పారెడ్డితో కలిసి ఉన్న ఫోటోస్ ని షేర్ చేస్తూ.. నా అద్భుతమైన యాత్ర ముగిసింది. నా హృదయంలో హిమాలయాలకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. మహాభారతంలో చదివినప్పటి నుండి ఎప్పటికైనా సరే ఈ ప్రాంతాలన్నీ చూడాలని ఉండేది.
https://www.instagram.com/p/CVWozDHh5oQ/?utm_source=ig_embed&ig_rid=4b7a6313-038d-497e-9c62-2cdd80892d5c
ఫైనల్ గా నేను కోరుకున్నట్లే దేవతలు కొలువై ఉన్న ఈ అందమైన భూలోక స్వర్గాన్ని కళ్ళారా చూడగలిగానని.. నా ఆధ్యాత్మిక యాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది.. అంటూ సమంత పోస్ట్ చేసింది. అలాగే ఈ ట్రిప్ కంటే ముందు రుషికేష్ కు వెళ్ళిన సమంత.. అక్కడ ఎంతో ప్రసిద్ధి చెందిన మహర్షి మహేష్ యోగి ఆశ్రమాన్ని సందర్శించానని మరో ఫోటోను షేర్ చేసింది. ది బీటెల్స్ నడిచిన చోట తాను అడుగుపెట్టానంటూ చెప్పింది.
తమ పాటలతో ధ్యానాన్ని ప్రపంచ వ్యాప్తం చేసిన మహర్షి మహేష్ యోగి ఆశ్రమాన్ని చూశానని అక్కడ దిగిన ఫోటోస్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో నెటిజన్లు సామ్ పోస్టులకు రకరకాలుగా స్పందిస్తున్నారు. నాగచైతన్యతో విడాకులు, సోషల్ మీడియా, యూట్యూబ్ లో పోస్టులు, కామెంట్స్ తో చాలా ఒత్తిడికి గురవుతున్న సమంత.. మానసిక ప్రశాంతత కోసం ఇలా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.