Samantha : ప్రస్తుతం సమంత, చైతన్యల విడాకుల విషయం ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. వీరి గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని అభిమానులు సంతోషపడిన కొంత సమయానికి చైతన్య చేదు వార్త అని తెలియజేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కీలక నిర్ణయం తీసుకుని తమ బంధం నుంచి విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నామని చైతన్య తెలియజేశారు.
ఇదిలా ఉండగా సమంత ఇష్యూ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారడంతో సిద్ధార్థ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే సిద్ధార్థ ట్వీట్ చేస్తూ తాను చిన్నప్పుడు స్కూల్ లో నేర్చుకున్న మొదటి పాఠం ఏంటంటే.. మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు.. మరి మీ సంగతి ఏంటి ? అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://twitter.com/Actor_Siddharth/status/1444303130175311878
అయితే గతంలో సమంత, సిద్ధార్థ్ ప్రేమలో ఉన్నారని.. కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారనే వార్తలు వీరి గురించి పెద్ద ఎత్తున వినిపించాయి. ఈ క్రమంలోనే సమంత విడాకుల అనంతరం హీరో సిద్ధార్థ్ స్పందించడంతో.. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అయితే ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారా.. అన్నది మాత్రం వెల్లడించలేదు.