Samantha : బాలీవుడ్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన షారూఖ్ ఖాన్ కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నారు. వరుస ఫ్లాపులు, డిజాస్టర్లతో సతమతమైన షారూఖ్ దాదాపుగా రెండు, మూడేళ్ల పాటు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్యలో షారూఖ్ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో సినిమా చేస్తున్నారు.
షారూఖ్ ఖాన్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి లయన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా, ప్రస్తుతం చిత్ర షూటింగ్ పూణేలో జరుగుతోంది. అయితే షారూఖ్ తనయుడు ఆర్యన్ అరెస్ట్ అయి జైల్లో ఉండడంతో షారూఖ్ షూటింగ్ రద్దు చేసుకొని ముంబై వచ్చారు. ఈ సినిమా ఇప్పట్లో మొదలయ్యేట్టు కనిపించకపోవడంతో నయనతార సినిమా నుండి తప్పుకోనుందని సమాచారం.
నయనతార అక్టోబర్ నెలలో మాత్రమే ఈ సినిమా కోసం కాల్షీట్ ఇచ్చింది. నవంబర్ లో మరికొన్ని సినిమాలకు కాల్షీట్స్ ఇవ్వడంతో ఈమె తిరిగి సినిమాల్లో పాల్గొనలేక పోతున్నానని సినిమా నుంచి పూర్తిగా తప్పుకున్నట్లు సమాచారం. ఇప్పుడు నయన్ తప్పుకోవడంతో ఆమె స్థానాన్ని సమంతతో రీ ప్లేస్ చేయాలని అనుకుంటున్నారట. నిజానికి ఈ ప్రాజెక్ట్ కోసం ముందుగా నయన్ ను హీరోయిన్ గా అనుకోలేదని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం అట్లీ మొదట సమంతని సంప్రదించాడు. కానీ షారూఖ్ ఖాన్ సినిమాకి సమంత నో చెప్పడంతో తర్వాత ఆ పాత్ర నయనతార ఖాతాలో పడింది.
పిల్లల్ని కనాలన్న ఆలోచనలో ఉన్నందునే సమంత అప్పట్లో ఈ మూవీకి నో చెప్పినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది కనుక ఆమె అందుబాటులోనే ఉంటోంది. ఇక ఎలాగూ నయనతార అందుబాటులో ఉండడం లేదు కనుక ముందు అనుకున్నట్లుగానే సమంతనే ఈ మూవీలో తీసుకోవాలని అనుకుంటున్నారట. దీంతో సమంత ఈ మూవీలో చేస్తుందని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా సమంత అదృష్టం అలా ఉంది మరి..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…