Naga Chaithanya : వెండితెరపైనే కాదు, నిజజీవితంలోనూ నాగచైతన్య, సమంతలు ముచ్చటైన జంటగా కనిపిస్తారు. ‘ఏమాయ చేసావే’తో మొదలైన వీరి ప్రయాణం ‘మనం’, ‘ఆటో నగర్ సూర్య’ సినిమాలతో మరింత బలపడింది. పెళ్లైన తర్వాత కూడా జంటగా నటించి హిట్లు కొట్టారు. పదేళ్ల స్నేహం, మూడేళ్ల దాంపత్యం తర్వాత ఈ ఇద్దరూ అక్టోబర్ 2న విడాకులు ప్రకటించారు.
విడాకుల తర్వాత సమంత- నాగ చైతన్య సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ జంట పలు సినిమాలలో నటించి సందడి చేయగా, విడాకులకి ముందు నందిని రెడ్డి దర్శకత్వంలో కలసి ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ విడాకుల తర్వాత సీన్ మారిపోయింది. నందిని రెడ్డి దర్శకత్వంలో చైతూ చేయబోయే సినిమాలో కథానాయికగా సమంతకు బదులు మరొకరిని తీసుకోబోతున్నారట.
నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత జబర్దస్త్, ఓబేబి అనే సినిమాలను చేసింది. అదేవిధంగా ఆహాలో సమంత నిర్వహించిన సామ్ జామ్ అనే టాక్ షోకి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. వీరిద్దరికి మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే చైతూ వలన సమంతని తన సినిమాలో తీసుకోలేకపోతుందట నందిని. ఈ సినిమా కాకపోయినా సమంత ఇతర ప్రాజెక్టులకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…