Samantha : టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరుపొందిన సమంత, నాగచైతన్య ఇద్దరూ విడిపోవడం అసలు ఎవరికీ నచ్చలేదు. ఫ్యాన్స్ ఈ విషయంపై ఇప్పటికీ అసంతృప్తిగానే ఉన్నారు. అసలు వీరు ఇద్దరూ ఎందుకు విడిపోయారు ? అన్న విషయం అయితే ఇంకా తెలియలేదు. కానీ విడాకుల ప్రకటన తరువాత వీరు ఎవరి జీవితాల్లో వారు బిజీగా మారిపోయారు. సమంత, చైతన్య వరుసగా సినిమాలు చేస్తున్నారు.
అయితే వీరి విడాకుల సంఘటన జరిగిన తరువాత నుంచి వీరి గురించి ఎప్పుడూ ఏదో ఒక విషయం వైరల్ అవుతూనే ఉంది. తాజాగా నాగచైతన్యపై సమంత చేసిన వ్యాఖ్యలు అంటూ ఓ వీడియో ప్రచారం అవుతోంది. అది సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. సమంత నిజంగానే చైతన్యను మెచ్చుకుందంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి అది చాలా పాత వీడియో. కానీ కొందరు దాన్ని కొత్త వీడియోగా ప్రచారం చేస్తున్నారు. ఇక అందులో ఏముందంటే.. గతంలో చైతూ తనకు సహాయం చేసిన విషయాన్ని సమంత గుర్తు చేసుకుంది. ఆ టైంలో నా దగ్గర డబ్బులు లేవు. కనీసం ఇంటికి ఫోన్ చేసి మా అమ్మతో మాట్లాడాలనుకున్నా ఫోన్ లో డబ్బులు లేవు. దీంతో ఆ విషయం నాగ చైతన్య తెలుసుకుని వెంటనే తన ఫోన్ ఇచ్చాడు. ఎంతసేపైనా మాట్లాడుకో అని చెప్పాడు.. అంటూ సమంత గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ క్రమంలోనే ఆమె ఆ వీడియోలో నాగ చైతన్య పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్.. అంటూ ప్రశంసలు కురిపించింది.
అయితే కొందరు ఆ పాత వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. దీంతో సమంత ఇప్పుడు నిజంగానే తన భర్త చైతూ గురించి ఆ కామెంట్లు చేసిందేమోనని అనుకుంటున్నారు. ఇక సమంత ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తమ విడాకుల ప్రకటన పోస్టును డిలీట్ చేసింది. దీంతో వీరు మళ్లీ కలవబోతున్నారా.. అనే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అదేమీ జరగలేదు.
ఇక సమంత ప్రస్తుతం కాతువాకుల రెండు కాదల్ అనే తమిళ మూవీలో నటించగా.. ఈ మూవీ ఏప్రిల్‌లో విడుదల కానుంది. దీంతోపాటు యశోద అనే పాన్ ఇండియా మూవీలో, శాకుంతలం అనే మరో మూవీలోనూ సమంత నటించగా.. అవి కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. ఇక నాగచైతన్య నటించిన బంగార్రాజు ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సాధించగా.. త్వరలో లాల్ సింగ్ చడ్డా అనే హిందీ మూవీలో చైతూ కనిపించనున్నాడు. మరోవైపు అమెజాన్ ప్రైమ్‌లో రానున్న దూత అనే హార్రర్ సిరీస్ లో నాగచైతన్య నటించనున్నాడు. ఇటీవలే చైతూ, రాశిఖన్నా కలిసి నటించిన థాంక్ యూ అనే మూవీ షూటింగ్ పూర్తయింది. ఇది త్వరలో విడుదల కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…