Anchor Jhansi : బుల్లితెరతోపాటు వెండితెరపై కూడా పలు పాత్రల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్లలో.. సీనియర్ యాంకర్ ఝాన్సీ కూడా ఒకరు. ఈమె ప్రస్తుతం ఎక్కువగా కనిపించడం లేదు. ఒకప్పుడు ఈమె ఉదయభాను, సుమతోపాటు టీవీల్లో ఎక్కువగా కనిపించి అలరించారు. అయితే ప్రస్తుతం బుల్లితెరపై ఈమె పెద్దగా కనిపించడం లేదు. ఇక ఝాన్సీ ముక్కు సూటి మనిషి అని చెప్పవచ్చు. ఆమె ఏం ఉన్నా సరే ముఖం మీదే చెప్పేస్తారు. ఈ క్రమంలోనే ఆమె జీవితంలోనూ అనేక కష్టనష్టాలను చవి చూసింది.
ఝాన్సీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె జీవితం, సంసారం సరిగ్గా సాగలేదు. ఒక కుమార్తె జన్మించాక ఆమె భర్తతో విడాకులు తీసుకున్నారు. జోగి బ్రదర్స్‌లో ఒకరిని ఆమె పెళ్లి చేసుకున్న విషయం విదితమే. ఇక ఆమెకు చిన్న వయస్సులోనే విడాకులు అయ్యాయి. కానీ ఆమె మరో పెళ్లి చేసుకోలేదు. కుమార్తెను గారాబంగా పెంచుకుంటూ జీవితం గడుపుతోంది. ఇక తన కుమార్తె మాత్రమే కాక ఆమె ఇంకో ఇద్దరిని దత్తత తీసుకుని చదివిస్తోంది. ఆమె దాతృత్వ గుణం ఎలాంటిదో ఈ ఒక్క విషయం చాలు.
ఇక ఝాన్సీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తనకు సంబంధించిన పలు విశేషాలను ఆమె తెలియజేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో సోషల్ మీడియాలో తాను చేసిన సెటైరికల్ పోస్ట్ వెనుక ఆంతర్యం ఏమిటో ఝాన్సీ తెలిపింది. ప్రస్తుతం మీడియా అతి ఎక్కువగా చేస్తుందని.. సెలబ్రిటీల జీవితాల్లోకి తొంగి చూస్తున్నారని.. నానా హడావిడి చేస్తున్నారని.. ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక మా ఎన్నికల సమయంలో తాను.. అనగనగా ఒక ఎద్దు, దానికొక పుండు, పుండులో పురుగులు, ఏంటీ కాకుల గోల.. అని తాను మీడియాను ఉద్దేశించే అన్నానని.. అయితే ఈ పోస్టు తాను టాలీవుడ్‌ను ఉద్దేశించి పెట్టానని కొందరు భావించారని చెప్పింది.
ఇక ఝాన్సీ తనకు ఇష్టమైన ఆహారం గురించి కూడా చెప్పింది. తనకు రాగి సంగటి, జొన్న అన్నం, చద్దన్నం, పచ్చి పులుసు, పచ్చి మిర్చి, ఉల్లిపాయ వంటివి చాలా ఇష్టమని, పండ్ల రసాలను ఎక్కువగా తాగుతానని.. తెలిపింది. తన కుమార్తె పేరు ధన్య అని.. ఢిల్లీలో బయోటెక్ రీసెర్చర్‌గా చేస్తుందని, ఆమెకు వయొలిన్ వాయించడం తెలుసని, భరత నాట్యం కూడా నేర్చుకుంటుందని చెప్పింది. తన కుమార్తె నటి కావాలనుకుంటే తాను వద్దని చెప్పబోనని.. కానీ ఆమె సైంటిస్టు కావాలని కలలు కంటుందని.. ఝాన్సీ తెలియజేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…