Samantha Income : అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంత స్పీడ్ పెంచింది. వరుస సినిమాలకు ఓకే చెబుతోంది. దీంతోపాటు సోషల్ మీడియాలోనూ పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తోంది. పలు మ్యాగజైన్స్‌కు చెందిన కవర్ పేజ్‌లకు ఇప్పటికే ఫొటోషూట్స్ చేసింది. ఇక సమంత సంపాదన విషయానికి వస్తే ఆమె ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల మేర తీసుకుంటున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఆమె ప్రస్తుతం పలు వరుస సినిమాలతో బిజీగా ఉంది.
సమంత ప్రస్తుతం యశోద అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విజయ్ దేవరకొండతో కలసి ఖుషి అనే మూవీ చేస్తోంది. శివ నిర్వాణ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం సమంత ముంబైలో ఉంది. అక్కడ కాఫీ విత్ కరణ్ అని కరణ్ జోహార్ షోలో పాల్గొనేందుకు వెళ్లింది. అయితే కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాకుండా సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తోంది. ఆమె నెలకు దీని ద్వారా రూ.3 కోట్ల వరకు సంపాదిస్తుందని సమాచారం. పలు బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను ఆమె ప్రమోట్ చేస్తూ నెలకు ఆ మొత్తం సంపాదిస్తుందని తెలుస్తోంది.

ఇక తాజాగా ఓ కంపెనీకి చెందిన బికినీని ధరించిన సమంత రూ.90 లక్షల మేర వసూలు చేసిందని సమాచారం. బ్లాక్ కలర్ బికినీ ధరించిన ఆమె ఆ మొత్తాన్ని అందుకుందట. అయితే ఆ బికినీ ఖరీదు రూ.30వేలని తెలిసింది. ఓ ప్రముఖ దుస్తుల కంపెనీకి చెందిన బికినీ అది. దాన్ని ప్రమోట్ చేసినందుకు సమంత రూ.90 లక్షలు ముట్టాయట. ఇలా సమంత ఓ వైపు సినిమాలతోనే కాకుండా మరోవైపు ఇలా బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ కూడా రెండు చేతులా సంపాదిస్తోంది.