Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్ని రోజులుగా మయోసైటిసిస్ అనే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం అందరికి తెలిసిందే. భారీగా ఎక్సర్ సైజులు చేసి కండరాలపై బాగా ఒత్తిడి పెరిగి, శారీరక ఒత్తిడికి గురైన సమంతకు ఈ మయోసైటిస్ అనే అరుదైన చికిత్సకు అందుబాటులో లేని వ్యాధి సోకినట్టు సమాచారం. మయోసైటిసిస్ సమస్యతో బాధపడుతున్న సమంత ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
అయితే సమంత మయోసైటిసిస్ సోకిన వెంటనే అమెరికాలో కొద్ది రోజులు పాటు చికిత్స తీసుకున్నారు. మయోసైటిసిస్ అనే అరుదైన వ్యాధికి చికిత్స కోసం అమెరికా వెళ్లి వచ్చి ట్రీట్ మెంట్ తీసుకున్న సమంత హైదరాబాద్ లోని ఆస్పత్రిలో ఉంటూ చికిత్స కొనసాగిస్తోంది. ఇండియాలో కూడా ఈ వ్యాధికి చికిత్స తీసుకున్న సమంత ఇంగ్లీష్ మందులతో ఈ వ్యాధి నయం కాకపోవడంతో కేరళలో ఆయుర్వేద వైద్యం కూడా ప్రయత్నం చేశారని వార్తలు కూడా వినిపించాయి.
ప్రస్తుతం సమంత ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని, అందుకే మెరుగైన చికిత్స అందుబాటులో ఉన్న దక్షిణ కొరియాకు తరలించినట్టుగా సమాచారం వినిపిస్తుంది. ఇలా మయోసైటీస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో సమంత ఆరోగ్యం మరింత క్షీణించిందట ఇక అమెరికాలో కూడా ఈ మయోసైటిస్ వ్యాధికి చికిత్స లేకపోవటంతో సమంత దక్షిణ కొరియా వెళ్లిందని సోషల్ మీడియాలలో వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఒక్క దక్షిణకొరియాలోనే అత్యంత ఆధునిక, సంప్రదాయ వైద్యంలో కండరాలక్షీణతకు చికిత్స ఉందని తెలియడంతో సమంత అక్కడికి వెళ్లినట్టు సమాచారం. అయితే సమంత దక్షిణ కొరియా వెళ్లిందన్న వార్తలపై ఆమె కానీ, ఆమె సన్నిహితులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అధికారికంగా ఎటువంటి విషయాన్ని బయటపెట్టలేదు. ఈ వార్తలపై నిజమెంత అనేది సమంత ఇచ్చే సమాచారం పై ఆధారపడి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…