Susmitha : చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత భ‌ర్త బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిస్తే.. షాక‌వుతారు..!

Susmitha : సినిమా ఇండ‌స్ట్రీకి చిరంజీవి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే వ‌చ్చారు. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ అయ్యారు. ఇప్పుడు ఇండ‌స్ట్రీకే పెద్ద‌న్న‌గా మారారు. 1955 ఆగస్టు 22వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో కొణిదెల వెంకట్రావు, అంజనా దేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించారు. తన 25వ ఏట అంటే 1980లో హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం కాగా ఇద్దరు కూతుళ్లు సుస్మిత, శ్రీజ.. కుమారుడు రామ్ చరణ్. ఇక చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత గురించి అందరికీ తెలిసిందే.

సుస్మిత‌కు చెన్నైలో స్థిరపడిన విష్ణుప్రసాద్ తో వివాహం జరిపించారు. విష్ణు ప్రసాద్ కుటుంబం రాయలసీమ నుంచి వెళ్లి తమిళనాడులో స్థిరపడింది. విష్ణు ప్రసాద్ తాత ఎల్‌వీ రామారావు అంటే అప్పట్లో చెన్నైలో పేరు మోసిన వ్యాపార‌వేత్త‌. జపాన్, సింగపూర్, అమెరికా వంటి దేశాలతో ఆయన వ్యాపార లావాదేవీలు కొన‌సాగించేవారు. ఆయన కుమారుడు ఎల్‌వీ ప్రసాద్, చంద్రిక దంపతుల కొడుకే విష్ణు ప్రసాద్. ఇక విష్ణు ప్రసాద్ బిజినెస్ రంగంలో అడ్మినిస్ట్రేషన్ మాస్టర్ డిగ్రీ చేశాడు. విదేశాలలో చదువు పూర్తి చేసుకుని త‌మ‌ వ్యాపారాలను చూసుకోవడం మొదలుపెట్టాడు. తాత ప్రారంభించిన పామాయిల్ వ్యాపారం తండ్రి సారథ్యంలో బాగా డెవలప్ కాగా.. విష్ణు ప్ర‌సాద్ వ‌చ్చాక ఆ బిజినెస్ మ‌రింత వృద్ధిలోకి వ‌చ్చింది.

Susmitha

ఇక విష్ణు ప్రసాద్, సుస్మిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సుస్మిత ప్రస్తుతం తన భర్త ప్రోత్సాహంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. సుస్మిత నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చ‌దువుకుంది. దీంతో ఆమె సినిమాల‌లో న‌టుల‌కు కాస్ట్యూమ్‌ల‌ను డిజైన్ చేస్తోంది. చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. సినీ రంగ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావ‌డంతో సుస్మిత‌ను భ‌ర్త విష్ణు ప్ర‌సాద్ ప్రోత్స‌హించాడు. దీంతో ఆమె సినిమాలకు ప‌నిచేస్తోంది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM