Samantha : విడాకుల తర్వాత సమంత ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు నిర్మాతలు ఆమె వెనుక క్యూ కడుతున్నారు. చైతన్యతో వివాహం తర్వాత పరిమితంగా సినిమాలు చేస్తూ వస్తున్న ఆమె విడిపోయిన తర్వాత వరుస సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. రెండు ద్విభాషా చిత్రాలకు ఒకే చెప్పింది. అందులో ఓ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్, మరో చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ సంస్థల్లో చేస్తోంది.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషనల్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప ది రైజ్’ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేస్తోంది. ఈ సాంగ్ కోసం ఏకంగా సమంతకు కోటిన్నర రూపాయలు రెమ్యునరేషన్‌గా ఇస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. సమంత త్వరలోనే బాలీవుడ్‌లోకి ప్రవేశించనుందని, హీరోయిన్ తాప్సీ ఈ సినిమాను నిర్మించబోతుందని వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రంలోనూ సమంత కథానాయిక అని అంటున్నారు.
2005లో అతడు, 2010లో ఖలేజా లాంటి సినిమాలు చేసిన తర్వాత ఈ కాంబినేషన్‌లో మూడో సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు ఫ్యాన్స్. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుండగా, ఇందులో పూజా హెగ్డేని కథానాయికగా అనుకున్నారు. కానీ ప్రాజెక్ట్‌లకు డేట్స్ సర్దుబాటు చేయడంలో ఆమె సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహేష్ సినిమా ఆఫర్ వదులుకున్నట్టు తెలుస్తోంది. పూజా నో అనడంతో ఆ స్థానంలో సమంత వచ్చి చేరినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…