Akhanda Movie : నందమూరి అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాలకృష్ణ తాజా చిత్రం.. అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. డిసెంబర్ 2న ఈ మూవీని విడుదల చేస్తున్నారు. కాగా ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
నవంబర్ 27న హైదరాబాద్‌లోని మాదాపూర్ శిల్పకళావేదికలో అఖండ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా హాజరు కానున్నాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
అఖండ ప్రీ రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ తోపాటు పలు ఇతర ముఖ్య అతిథులు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వారు ఎవరు అనేది తెలియడం లేదు. ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, టీజర్ అందరినీ ఇప్పటికే ఎంతో ఆకట్టుకున్నాయి.
అఖండలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. శ్రీకాంత్ విలన్ పాత్రను పోసించారు. అత్యంత భారీ బడ్జెట్‌తో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిరియాల రవీందర్ రెడ్డి ఈ మూవీని నిర్మించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…