Samantha : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సమంతకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగు అభిమానులకు చేరువగా తమిళం, తెలుగు భాషలతోపాటు మలయాళం భాషల్లో కూడా నటించేస్తుంది. స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ కెరీర్ ను ఫోకస్ చేస్తోంది. నెక్ట్స్ బాలీవుడ్ సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో వినూత్నమైన పాత్రలో నటించి ప్రేక్షకుల్ని అలరించింది. లేటెస్ట్ గా తాప్సీ సొంత బ్యానర్ లో ఓ సినిమాలో యాక్ట్ చేస్తోంది. అలాగే మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో సమంత అతి త్వరలో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని కూడా ఏలేస్తుందన్నమాట.
ఇదిలా ఉండగా ప్రస్తుతం సమంత ఓ ప్రత్యేకమైన గౌరవాన్ని దక్కించుకుంది. గోవాలో జరగనున్న 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలకు సమంతను స్పెషల్ గెస్ట్ ఆహ్వానిస్తున్నారు. ఎంతో గౌరవప్రదమైనహోదాలో సమంతకు ఈ ఆహ్వానం దక్కడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు ఏ సెలబ్రిటీని ఈ హోదా కోసం ఆహ్వానించలేదు. ఫస్ట్ ఈ బంపర్ ఆఫర్ ని సామ్ సొంతం చేసుకోవడం విశేషం.
సమంతతోపాటు ఈ కార్యక్రమానికి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ కూడా హాజరవుతున్నారు. ప్రముఖ దర్శకుడు అరుణ్ రాజే, వివేక్ అగ్ని హోత్రి, యాక్టర్ జాన్ ఎడతతిల్ లు కూడా ఈ ప్రోగ్రామ్ కి వస్తున్నారు. అలాగే ప్రస్తుతం సమంత తన కెరీర్ పై ఫోకస్ చేసింది. తెలుగు, తమిళం భాషల్లో నటించేలా సినిమాలు ప్లాన్ చేస్తోంది. తెలుగులో గుణశేఖర్ డైరెక్టర్ గా తెరకెక్కిస్తున్న శాకుంతలం సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది. తమిళంలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతారలతోపాటు సమంత కూడా కీలక పాత్రలో నటిస్తోంది.