Samantha : అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు చెప్పినప్పటి నుంచి సమంత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది. అలాగే పలు బ్రాండ్లను కూడా ప్రమోట్ చేస్తోంది. దీంతోపాటు సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫొటోషూట్స్‌ను పోస్ట్ చేస్తోంది. పలు మ్యాగజైన్లకు చెందిన కవర్ ఫొటోలకు పోజులు కూడా ఇస్తోంది. అయితే సమంత ఈ మధ్య కాలంలో చీటికీ మాటికీ ముంబై వెళ్తోంది. హైదరాబాద్‌కు రావడం.. షూటింగ్ చేయడం.. పని అవగానే ముంబై వెళ్లడం.. ఇదీ సమంత చేస్తున్న పని. అయితే ఇలా సమంత మాటిమాటికీ ముంబై ఎందుకు వెళ్తోంది.. దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి.. అన్న విషయానికి వస్తే..
హైదరాబాద్‌లో నాగచైతన్య ఉంటాడు కదా.. అలాగే ఇక్కడ ఉండడం వల్ల మీడియాకు కూడా ఎదురు పడాల్సి వస్తోంది. దీంతో వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నదట. నాగచైతన్య ఉండేది హైదరాబాద్‌లోనే కనుక.. ఆమెకు ఇంకా పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. కనుక వాటి నుంచి బయట పడేందుకే సమంత ముంబైలో నివసిస్తుందని తెలుస్తోంది. అలాగే అక్కడ ఆమెకు పలు ఆఫర్లు కూడా వస్తున్నాయట. కనుక కేవలం పని ఉన్నప్పుడే హైదరాబాద్‌కు వచ్చి వెళ్తోంది. పూర్తి స్థాయిలో ఆమె ముంబైలోనే ఉంటోంది.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ఈమె విజయ్ దేవరకొండతో కలసి నటిస్తున్న ఖుషి మూవీ తొలి షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. కాశ్మీర్‌లో షూటింగ్ చేశారు. అలాగే సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న యశోద మూవీ ఆగస్టులో విడుదల కానుంది. దీంతోపాటు ఓ సిరీస్‌లోనూ ఈమె నటిస్తుందని తెలుస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన రావల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…