Viral Video : కృషి, పట్టుదల ఉండాలే కానీ.. మన శారీరక వైకల్యం దేనికీ అడ్డుకాదు. మనసులో సంకల్పం ఉండాలి. ఏదో సాధించాలన్న తపన ఉండాలి. అలాంటి వ్యక్తిత్వం ఉంటే జీవితంలో ఎవరైనా సరే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. తమ మార్గంలో ఎన్ని ముళ్ల కంచెలు ఉన్నా సరే లెక్క చేయరు. ముందుకే సాగుతుంటారు. అవును.. ఈ సూత్రాలను బాగానే వంట బట్టించుకుంది. కాబట్టే ఆ బాలిక తనకు శారీరక వైకల్యం ఉన్నప్పటికీ ఏమాత్రం దాన్ని లెక్క చేయకుండా ముందుకే సాగుతోంది. కష్టపడి విద్యాభ్యాసం కొనసాగిస్తోంది. దీంతో అందరి నుంచి ఆమె ప్రశంసలను అందుకుంటోంది. ఇక అసలు విషయం ఏమిటి ? అని వివరాల్లోకి వెళితే..
బీహార్‌లోని ఫతేపూర్‌కు చెందిన సీమా అనే బాలిక వయస్సు 10 ఏళ్లు. ఈమెకు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎడమ కాలు పూర్తిగా పోయింది. అయినప్పటికీ ఈమె ఏమాత్రం భయపడలేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. ఒంటికాలిపైనే స్కూల్‌కు రోజూ నడిచివెళ్తూ విద్యాభ్యాసం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె రోజుకు కిలోమీటర్ దూరం పాటు ఒంటికాలిపైనే నడిచి వెళ్తోంది. అయితే ఈమెను వీడియో తీసి ఈమె సమస్య గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈమెకు సహాయం చేసేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు.
సీమాకు ఇప్పటికే ఆ జిల్లా కలెక్టర్ ఓ ట్రైసైకిల్ ను అందజేశారు. దీంతో ఆమె ఆ ట్రై సైకిల్‌పై స్కూల్‌కు వెళ్తోంది. ఇక సీమా గురించి నటుడు సోనూసూద్‌కు కూడా విషయం తెలిసింది. దీంతో ఆయన కూడా సీమాకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇలా సోషల్ మీడియా ద్వారా సీమా గురించి చాలా మంది తెలుసుకుని ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఏదో ఒక రోజు తాను అనుకున్న లక్ష్యాన్ని కచ్చితంగా సాధిస్తుందని అందరూ అంటున్నారు. కాగా సీమా స్కూల్‌కు వెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…