Naga Chaitanya : ఏ మాయ చేశావే సినిమాలో జంటగా నటించి నిజ జీవితంలో కూడా ఒక్కటైన జంట సమంత, నాగచైతన్య. వీరిని అభిమానులు ముద్దుగా చై సామ్ అని పిలుచుకుంటారు. ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ గతేడాది విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. కొన్నాళ్ళ పరిచయం, ఎన్నో ఏళ్ల ప్రేమ.. అనంతరం పెళ్లి చేసుకున్న ఈ జంట ఐదేళ్లకే వీరి వైవాహిక జీవితానికి శుభం కార్డు వేశారు. చూడముచ్చటగా ఉన్న ఈ జంట విడాకులు ఎందుకు తీసుకున్నారు అని మాత్రం ఎవరికీ తెలీదు. కానీ ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకుంటున్నారు. తాజాగా సమంత తండ్రి అయిన జోసెఫ్ ప్రభు ఫేస్ బుక్ లో చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది.
లాంగ్ లాంగ్ ఎగో దేర్ వాస్ ఏ స్టోరీ అంటూ ఆయన ఇంగ్లీషులో ఒక పోస్ట్ పెట్టాడు.. సమంత తండ్రి జోసెఫ్ చేసిన పోస్ట్ అర్థం ఏంటి అంటే.. ఒకానొక సమయంలో ఒక కథ ఉండేది, కానీ ఇప్పుడు అది లేదు.. ఆ కథ ఇక ఎప్పటికీ ఉండదు. కనుక ఇప్పుడు కొత్త కథను మొదలు పెట్టాలి, కొత్త చాప్టర్ మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నాగ చైతన్య అభిమానులతో పాటు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సడన్ గా సమంత తండ్రి ఈ పోస్ట్ పెట్టడానికి గల కారణం ఏంటి అంటూ చర్చ జరుగుతుంది. ఈ సమయంలో సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. సమంత మరియు నాగచైతన్య కు అధికారికంగా విడాకులు వచ్చాయి.
కనుక ఈ సందర్భంగా ఆయన ఈ పోస్ట్ పెట్టాడు అంటూ కొందరు అంటున్నారు. అసలు విషయం ఏంటి అనేది ఆయన చెప్తే కానీ తెలీదు. సమంత లేదా ఆమెకు సంబంధించిన వారు ఎవరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా అది నాగ చైతన్యకు లింక్ చేసి ఏదో ఒక రకంగా పుకార్లు షికార్లు చేయడం ఈ మధ్య కామన్ అయిపోయింది. ప్రస్తుతం చైతన్య, సమంత కెరీర్ పరంగా బిజీ అయిపోయారు. చైతూ పరశురాం దర్శకత్వంలో ఒక సినిమాను, వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే సామ్ ఖుషి, యశోద, శాకుంతలంతో పాటు బాలీవుడ్ లో ఓ వెబ్ సెరీస్ లో నటిస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…