తెలుగు బుల్లితెర చరిత్రలోనే టాప్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. భారీ అంచనాల నడుమ సీజన్ 6 తాజాగా మొదలైంది. ముందు నుంచే షో నిర్వాహకులు సీజన్ 6 పై అంచనాలు పెంచారు. ఇందులో సెలబ్రిటీలతోపాటు సామాన్యులు సైతం పాల్గొంటారని ప్రచారం చేశారు. కానీ తాజా ఎపిసోడ్ చూస్తే సామాన్యుల ఊసే లేదు. తాజాగా ప్రకటించిన కంటెస్టెంట్స్ లిస్ట్‌లో ఒక్కరు కూడా సామాన్యుడు లేడు.
కీర్తిభట్, సుదీప, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్, గలాటా గీతు, అభినయ శ్రీ, రోహిత్ సాహ్ని, మరీనా, బాలాదిత్య, వాసంతి క్రిష్ణన్, షాని సాల్మన్, ఇనయ సుల్తానా, ఆర్జే సూర్య, జబర్దస్త్ ఫైమా, రాజేశేఖర్, అరోహి రావ్, సింగర్ రేవంత్, యూట్యూబర్ ఆదిరెడ్డి. ఇలా హౌస్‌లో 21 మంది సెలబ్రిటీలను హౌస్‌లోకి పంపారు. యూట్యూబర్ ఆది రెడ్డిని కామనర్ అని ఇంట్రడ్యూస్ చేసాడు హోస్ట్ నాగార్జున. ఆ తర్వాత అతను పెద్ద యూట్యూబర్ అని.. లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని.. బిగ్ బాస్ రివ్యూలతో పాపులర్ అయ్యారని కూడా స్పెషల్ వీడియో వేసి మరీ చూపించారు.
అంటే ఎంతో కొంత పాపులారిటీ ఉన్న వారిని హౌజ్‌లోకి పంపుతూ ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారే తప్ప.. బిగ్ బాస్ సామాన్యులకు అవకాశం కల్పిస్తాం అని చెప్పి.. ఆడిషన్స్ చేసి ఇప్పుడు ఛీటింగ్ చేశారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సామాన్యులకు బంపర్ ఆఫర్ అంటూ నాగార్జున అధికారికంగా మే నెలలో విడుదల చేసిన ప్రోమోను యూట్యూబ్ నుంచి తొలగించారు. దీన్ని బట్టి కావాలనే సామాన్యుడ్ని ఛీట్ చేశారని స్పష్ఠం అవుతోంది. ఎప్పటి మాదిరిగానే ఈ సారి బిగ్ బాస్ హౌజ్ లో వివిధ రంగాలకు చెందిన సెలబ్రెటీలు ఉన్నారు. దీనిపై స్టార్ మా ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…