Samantha : న‌య‌న‌తార ప్రియున్ని ట్రోల్ చేస్తున్న స‌మంత ఫ్యాన్స్‌.. కార‌ణం అదే..?

Samantha : న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి, స‌మంత‌.. ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న చిత్రం.. కాతు వాకుల రెండు కాద‌ల్‌. దీన్ని తెలుగులో క‌ణ్మ‌ణి రాంబో క‌తీజా పేరిట విడుద‌ల చేయ‌నున్నారు. ఈ నెల 28వ తేదీన ఈ మూవీ త‌మిళం, తెలుగు భాష‌ల్లో విడుద‌ల కానుంది. చాలా రోజుల త‌రువాత స‌మంత వెండితెర‌పై మ‌రోమారు ఈ సినిమా ద్వారా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. విడాకుల త‌రువాత రిలీజ్ అవుతున్న ఆమె న‌టించిన తొలి చిత్రం ఇదే కావ‌డం విశేషం. అయితే ఇందులో స‌మంత పాత్ర‌ను తీర్చిదిద్దిన తీరును ఆమె ఫ్యాన్స్ త‌ప్పుబ‌డుతున్నారు.

Samantha

కాతు వాకుల రెండు కాద‌ల్ సినిమాను న‌య‌న‌తార ప్రియుడు విగ్నేష్ శివన్ తెర‌కెక్కించారు. అయితే ఇందులో న‌య‌న‌తార గ్లామ‌ర్ షో చేయ‌లేదు. టీజ‌ర్‌, పోస్ట‌ర్‌ల‌ను చూస్తే ఆ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే స‌మంత మాత్రం గ్లామ‌ర్ షో చేసిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. దీంతో స‌మంత ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. నీ ప్రియురాలు ఒక‌లా.. స‌మంత మ‌రొక‌లా ఎందుకు.. నీ ల‌వ‌ర్ అని చెప్పి న‌య‌న‌తారతో చీర క‌ట్టించావా.. స‌మంత కాదు క‌దా.. క‌నుక‌నే ఆమెతో గ్లామ‌ర్ షో చేయిస్తున్నావా.. అంటూ స‌మంత ఫ్యాన్స్‌.. విగ్నేష్ శివ‌న్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే వాస్త‌వానికి న‌య‌న‌తార గ్లామ‌ర్ షో చేయ‌డం మానేసి చాలా రోజులే అవుతోంది. ఆమె న‌టిగా మంచి గుర్తింపు పొంది.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న‌ప్ప‌టి నుంచి గ్టామ‌ర్ షో చేయ‌డం లేదు. దీంతో ఆమె ప్ర‌తి మూవీలోనూ సాధార‌ణంగానే క‌నిపిస్తోంది. ఇక స‌మంత అలా కాదు. పెళ్ల‌యినా కూడా గ్లామ‌ర్ షో చేస్తూనే వ‌స్తోంది. ఇక విడాకులు ఇచ్చిన‌ప్ప‌టి నుంచి ఆ డోసు కాస్త పెంచిందే త‌ప్ప త‌గ్గించ‌లేదు. అందువ‌ల్ల గ్లామ‌ర్ షో చేయ‌డం అనేది ఆమె ఇష్ట‌మ‌ని.. అందులో ద‌ర్శ‌కుడి ప్ర‌మేయం ఉండ‌ద‌ని.. గ్లామ‌ర్ షో ఉంటుందా.. ఉండ‌దా.. అనేది సినిమా చేసే ముందే చెబుతారు క‌నుక‌.. స‌మంత మ‌నస్ఫూర్తిగానే ఈ మూవీకి ఒప్పుకుంద‌ని తెలుస్తోంది. అందులో ద‌ర్శ‌కున్ని త‌ప్పు ప‌ట్టాల్సిన ప‌నిలేద‌ని కొంద‌రు ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ఒక‌రు బ‌ల‌వంతంగా గ్లామ‌ర్ షో చేయించ‌లేర‌ని అంటున్నారు. ఇక సినిమాలో స‌మంత ఎలా క‌నిపిస్తుందో చూడాలి.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM