Samantha : గత కొద్దిరోజులుగా సమంత, నాగ చైతన్యల గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కథనాలు వినిపించాయి. ఈ క్రమంలోనే సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వచ్చిన వార్తలు నిజమేనని అక్టోబర్ 2వ తేదీన ఈ దంపతులు అధికారికంగా ప్రకటించారు. ఒక్కసారిగా సమంత, నాగచైతన్య విడాకుల విషయం తెలియగానే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు, అభిమానులు షాక్ కి గురయ్యారు.
ఇకపోతే సమంత విడాకుల విషయం గురించి పలువురు సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ఇది వారి వ్యక్తిగత నిర్ణయమని.. ప్రతి ఒక్కరూ వారి నిర్ణయాన్ని గౌరవించాలని ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే సమంత తండ్రి జోసెఫ్ ప్రభు తన కూతురి విడాకుల విషయంపై స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
సమంత విడాకుల విషయం వినగానే మైండ్ బ్లాక్ అయిపోయింది. అయితే ఈ విషయంలో సమంత ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని భావిస్తున్నాను. త్వరలోనే పరిస్థితులన్నీ చక్కబడతాయి.. అన్నారు. అయితే.. సమంతపై సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, పరిశోధకుడు ఇమంది రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పంతా సమంతదేనని అన్నారు.
చిన్న చిన్న అపార్దాలు ఏ దాంపత్యంలో అయినా వస్తాయి. నాగార్జున చాలా వైడ్‌గా ఆలోచిస్తారు. వెనకాల సురేష్ బాబు, వెంకటేష్ బాబు ఉన్నారు. సమంత తొందరపడినా వాళ్ళు తొందరపడరు. సమంత కూడా చాలా తెలివైంది. కానీ తెలివి ఎక్కువయ్యే ఈ నిర్ణయం తీసుకుంది. బంగారం లాంటి సంసారాన్ని కాళ్ళ దన్నుకుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. ఓ ఆరు మాసాల తర్వాత మీరు కలిసి ఉండాలనుకుంటే ఆ అవకాశాన్ని కోర్టు కల్పిస్తుంది.. అన్నారు.
అయితే సమంతకు చైతన్య సరైన వాడని అన్నారు. కానీ తప్పు చేసింది సమంతే అన్నారు. సమంతకు పిల్లల్ని కనడం ఇష్టం లేదని, సరోగసి ప్రయత్నిద్దామని చెప్పిందని అన్నారు. ఇది మగవాడికి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…