Samantha : తన పరువుకు భంగం కలిగించేలా కొన్ని యూట్యూబ్ చానల్స్ దుష్ప్రచారం చేశాయని ఆరోపిస్తూ.. సమంత తాజాగా కూకట్‌పల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తీర్పును న్యాయమూర్తి మళ్లీ వాయిదా వేశారు. దీంతో సమంత అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
నిజానికి ఈ కేసును మొదట గురువారం విచారణ చేపట్టగా.. సమంత తరఫు లాయర్ బాలాజీ కోర్టుకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. సమంత నటి కనుక, బిజీగా ఉంటుంది కనుక కేసును త్వరగా ముగించాలని కోరారు. అయితే చట్టం ముందు అందరూ సమానులే అని.. సమంత ప్రత్యేకం ఏమీ కాదని.. అన్ని పరువు నష్టం కేసుల్లాగే ఆమె కేసును కూడా విచారిస్తామని.. న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కేసును శుక్రవారానికి వాయిదా వేశారు.
అయితే శుక్రవారం కోర్టులో మళ్లీ వాదనలు జరిగాయి. పరువు నష్టం కేసులో డబ్బు అడిగే బదులు క్షమాపణలు కోరాలని.. అడగవచ్చు కదా.. అని న్యాయమూర్తి అన్నారు. అయితే తాము డబ్బు అడగలేదని, క్షమాపణలు మాత్రమే కోరుతున్నామని, అలాగే సదరు యూట్యూబ్ చానల్స్ కు చెందిన లింక్‌లను కూడా డిలీట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని లాయర్ కోరారు. దీంతో శుక్రవారం నుంచి సోమవారానికి కేసు విచారణ వాయిదా పడింది.
ఇక సోమవారం కూడా విచారణ జరిగింది. ఈ క్రమంలోనే లాయర్ బాలాజీ మాట్లాడుతూ.. సమంత ప్రతిష్ఠ ను దెబ్బతీసిన మూడు యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి పై ఇలా ఆరోపణలు చేస్తూ ప్రసారాలు చేయడం సరైంది కాదన్నారు. అనేక అవార్డులు, రివార్డులు సమంత తీసుకుందని, అలాంటి వ్యక్తి పేరు ప్రతిష్టలు దెబ్బతీసే విదంగా ప్రవరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సమంతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వార్తలు ప్రసారం చేస్తున్నారని, ట్విట్టర్ వేదికగా విడిపోతున్నామని ప్రకటించగానే సోషల్ మీడియాలో సమంతను విపరీతంగా ట్రోల్ చేశారని అన్నారు. ఆమెపై ఇలా దుష్ప్రచారం చేయడం తీవ్రమైన నేరమని, ఆమెకు అక్రమ సంబంధాలు అంటగట్టారని.. కోర్టుకు తెలిపారు. ఇక తమ పిటిషన్ లో ఎక్కడా డబ్బులు అడగలేదని, యూట్యూబ్ లింకులు మాత్రమే తొలగించాలని కోరామని, అలాగే భవిష్యత్తులోనూ ఇలాంటి వార్తలు రాయకుండా పర్మినెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరారు. కాగా గతంలోనూ శిల్పా శెట్టి కేసులో ముంబై హైకోర్టు ఇదే తరహాలో ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందని.. బాలాజీ కోర్టుకు తెలిపారు.
కాగా ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. తీర్పు మంగళవారానికి వాయిదా పడింది. మరి ఈ రోజు అయినా తీర్పు వస్తుందా.. లేక ఆలస్యం అవుతుందా.. అన్నది చూడాలి. కానీ.. తీర్పు ఆలస్యం అవుతుండడంపై సమంత నిరాశకు, అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…