Samantha : పెళ్లి, విడాకుల తర్వాత కూడా బిజీగా ఉన్న ఆర్టిస్టులు ఎవరంటే సమంత అనే చెప్పాలి. ఈ అమ్మడు విడాకుల తర్వాత కూడా పలు కార్యక్రమాలతో బిజీ అయింది. గోవాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 52వ ‘భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం’ (ఇఫీ)లో పాల్గొన్న ఆమె .. ‘ఫ్యామిలీమ్యాన్–2’ వెబ్ సిరీస్‌లోని క్లిష్టమైన యాక్షన్ పాత్ర రాజీని తాను ఎంచుకోవడానికి కారణాన్ని వివరించారు. కొత్తదనం కోసం తపిస్తున్న నేను ఆ పాత్రను ఠక్కున పట్టేసుకున్నా అన్నారు సమంత.
52వ ‘ఇఫీ’లో భాగంగా ఫ్యామిలీ మ్యాన్ రూపకర్తలు రాజ్, డీకే, నటి సమంత, అమెజాన్ ఇండియా ఒరిజినల్స్‌కు హెడ్ అయిన అపర్ణా పురోహిత్‌లతో ‘మాస్టర్ క్లాస్’ గోష్ఠి జరిగింది. అందులో సమంత మాట్లాడుతూ, ‘‘తెలుగు పరిశ్రమ, హైదరాబాద్ నా పుట్టినిల్లు. నటిగా నాకు ఈ స్థానాన్ని ఇచ్చింది అవే. నేనింకా హిందీ సినిమాలేవీ చేయలేదు కానీ, ఉత్తరాది పరిశ్రమకూ, దక్షిణాదికీ పెద్ద తేడా ఏమీ లేదు’’ అన్నారు.
ఫ్యామిలీ మ్యాన్ 2’లోని పాత్రతో ఇక హిందీ ‘ధూమ్’ సిరీస్ లాంటి వాటిలో అవకాశాలు రావచ్చన్న ప్రేక్షకుల ప్రశంసకు సమంత ఉబ్బితబ్బిబ్బవుతూ, ‘‘నేనిక ‘యాక్షన్ స్టార్’ అన్న మాట’’ అని నవ్వేశారు.
దర్శకులు రాజ్ అండ్ డీకే మాట్లాడుతూ, ‘‘రాజీ పాత్రకు తమిళం తెలిసిన నటి కావాలనుకున్నాం. తమిళ చిత్రం ‘సూపర్‌డీలక్స్’, తెలుగు ‘రంగస్థలం’ చూసి, ఆ పాత్రకు సమంత సరిపోతారనుకొని, సంప్రదించాం. మా అంచనాలను మించి ఆమె చేశారు. భావోద్వేగాల్లోనే జీవిస్తూ, కొన్ని సీన్లు కాగానే ఆమె వెక్కివెక్కి ఏడ్చిన ఘటనలు మాకు ఇప్పటికీ గుర్తే. చేతులకు గాయమై రక్తం కారుతున్నా డూప్‌లు లేకుండా సమంత చేసిన ఫైట్లు చూసి ఆశ్చర్యపోయాం’’ అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…