Bigg Boss 5 : బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ బయటకు వచ్చాక చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతూ సరదాగా గడుపుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఎంతలా కొట్టుకున్నా.. ఇక్కడ ఎలిమినేట్ అయిన తరువాత ఇంటి సభ్యులంతా బయట మాత్రం కలిసి సందడి చేస్తున్నారు. గెట్ టు గెదర్ పేరుతో ఒకరిని ఒకరు కలుసుకుంటున్నారు. తాజాగా ఆర్టిస్ట్ ప్రియా ఇంట జరిగిన పెళ్లి వేడుకలో పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సందడి చేశారు.
నవంబర్ 21న ప్రియకు వరుసకు కూతురయ్యే లోహిత పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకలకు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు జెస్సీ, ఉమాదేవి, సరయు విచ్చేశారు. పెళ్లి వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన వీరి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ‘మా ఇంట్లో పెళ్లి వేడుకలు షురూ’ అంటూ ఇంటి ముందు ముగ్గులేసిన ఫొటోను ప్రియ ఈ మధ్యే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
అంతకుమందు నటరాజ్ మాస్టర్ వైఫ్ సీమంతానికి కూడా.. బిగ్ బాస్ కంటెస్టెంట్లు హాజరయ్యారు. అక్కడ అంతా కలిసి సందడి చేశారు. ఇటీవల తండ్రి అయిన నటరాజ్ మాస్టర్ సైతం హౌస్ లో.. ఇతరులపై ఎప్పుడు మండిపడుతూ కనిపించే వారు. కానీ బయట ఇలా అందరితో నవ్వుతూ.. చాలా సరదాగా సందడి చేస్తున్నారు. ఇక అనారోగ్య సమస్యతో బయటకు వచ్చిన జెస్సీఅయితే పిలిచిన ప్రతి ఫంక్షన్‌కి వెళుతూ చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…