Samantha : నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించిన తరువాత నుంచి సమంత లైఫ్ ఎంతో బిజీగా మారిపోయింది. తరచూ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటోంది. ఓ వైపు సినిమా షూటింగ్స్ చేస్తూనే మరోవైపు సమయం లభించినప్పుడల్లా వెకేషన్‌లకు వెళ్తోంది. అలాగే పలు బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను కూడా ఆమె ప్రమోట్ చేస్తోంది. దీంతో ఆమె కేవలం ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే నెలకు రూ.3 కోట్ల వరకు సంపాదిస్తోందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. అయితే ఈమె ఈ మధ్య పాల్గొన్న కాఫీ విత్ కరణ్ జోహార్ షోలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించినట్లు సమాచారం.
కాఫీ విత్ కరణ్ జోహార్ షో అంటేనే వివాదాలకు మారుపేరు. ఈయన షో వల్ల గతంలో విడిపోయిన జంటలు ఉన్నాయి. అలాంటి షోకు సమంత గెస్ట్‌గా వెళ్లడంతో ఆమె తన విడాకుల వ్యహారంపై నోరు విప్పి ఉంటుందని భావించారు. అసలు ఆమె విడాకులు ఎందుకు ఇచ్చిందో అందులో చెప్పి ఉంటుందని అనుకున్నారు. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ షోకు సంబంధించి ప్రోమోను తాజాగా లాంచ్ చేశారు. ఇందులో సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
కాఫీ విత్ కరణ్ జోహార్ షోలో భాగంగా సమంత మాట్లాడుతూ.. చాలా మంది వివాహం అయ్యాక సంతోషంగా లేకపోవడానికి నువ్వే కారణమని ఆమె కరణ్ జోహార్‌ను ఉద్దేశించి మాట్లాడింది. అలాగే మీ సినిమాలు చూసి కభీ ఖుషీ కభీ ఘమ్ లా ఉంటాయని అందరే అనుకుంటారు. కానీ నిజ జీవితంలో మాత్రం కేజీఎఫ్‌లా ఉంటాయని సమంత మాట్లాడింది. అయితే ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక సమంత, అక్షయ్ కుమార్ కలసి ఈ షోలో పాల్గొనగా.. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో కరణ్ జోహార్ స్వయంగా తన ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఓ మూవీని తీస్తారని తెలుస్తోంది. ఈ షో సందర్భంగా ఆ మూవీ వివరాలను ప్రకటిస్తారని సమాచారం. ఈ షో 7వ సీజన్ జూలై 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందులో పలు ఎపిసోడ్లలో ఇతర బాలీవుడ్ స్టార్స్ కూడా సందడి చేయనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…