Samantha Chaithanya : టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగ చైతన్య-సమంత విడాకుల నిర్ణయం చాలా మందికి పెద్ద షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. నాలుగేళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట అక్టోబర్ 2న తాము విడిపోతున్నట్టు ప్రకటించారు. విడాకుల తర్వాత నాగ చైతన్య ఎటువంటి కామెంట్స్ చేయలేదు. అతను పూర్తి మౌనం వహిస్తుంచాడు. సమంత మాత్రం తనపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇస్తూ వస్తోంది.
సమంత విడాకుల డిప్రెషన్ నుండి బయటపడటానికి మిత్రులతో ఎక్కువగా గడుపుతోంది. వరుసగా విహార యాత్రలకు వెళుతోంది. అయితే విడాకుల తర్వాత వీరిద్దరూ కలిసింది లేదు. రామానాయుడు స్టూడియోలో ఒకరికొకరు ఎదురు పడినా కూడా ముఖాలు కూడా చూసుకోలేదని టాక్. అయితే ఇప్పుడు వీరు కలిసి ఉన్నపుడు కోల్గేట్ టూత్ పేస్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఉన్నారు. ‘కోల్గేట్ మౌత్ ఫ్రెష్’కు నాగచైతన్య, ‘కోల్గేట్ సాల్ట్’కు సమంత ప్రమోటర్స్‌గా ఉన్నారు.
సమంత-చైతూ విడిపోవడం వల్ల కంపెనీకి పెద్ద ఇబ్బందే వచ్చిందట. నాగచైతన్య, సమంతల డైవోర్స్ వల్ల తమకు ఇబ్బంది వచ్చిందనే చర్చ ముంబై యాడ్ ఏజెన్సీ వర్గాల్లో ఉందట. ప్రొఫెషనల్‌గా వీరిద్దరూ కలిసి పని చేస్తారా లేదంటే ఎడముఖం పెడముఖంగానే ఉంటారా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
నాగచైతన్య ప్రస్తుతం బంగార్రాజు, థాంక్యూ సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు సమంత చేతిలో ‘శాకుంతలం’, ‘యశోద’, ‘కాతువాకుల రెండు కాదల్’, ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ ప్రాజెక్టులు ఉన్నాయి. వరుణ్ ధావన్‌తో ఓ వెబ్ సిరీస్ కూడా చేయనుందని టాక్ వినిపిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…