RRR Movie : యావత్ ప్రపంచం ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మేకర్స్. ముంబై, చెన్నైలలో ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్లను నిర్వహించిన చిత్ర బృందం రీసెంట్‌గా కేరళలో కూడా వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమం కన్నులపండుగగా జరిగింది. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రానికి రూ.450 కోట్లు ఖర్చు చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగానే క్లారిటీ ఇచ్చింది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసమే దాదాపుగా రూ.20 కోట్లను ఖర్చు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. దాదాపు వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టేందుకు రాజమౌళి తనదైన శైలిలో ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఈ సినిమాకు గాను ఆయన 30 శాతానికి పైగా లాభాల్లో వాటా అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హీరోలిద్దరికీ కూడా సమానంగా పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించగా కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను ఒక్కో హీరోకు రూ.45 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ ముఖ్యమైన పాత్రలో కనిపించడంతో ఆయనకు రూ.25 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్లుగా సమాచారం. ఆలియా భట్ రూ.9 కోట్ల వరకు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన బడ్జెట్లో దాదాపు రూ.200 కోట్ల వరకు నటీనటులకు, అలాగే ఇతర టెక్నీషియన్స్ రెమ్యునరేషన్ కోసమే ఖర్చు చేశారట. సినిమా ప్రొడక్షన్ లో భాగంగా రూ.230 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…