Samantha : సమంత ప్రస్తుతం తన కెరీర్‌లో ఎన్నడూ లేనంత బిజీగా మారిపోయింది. వరుస సినిమాలతో జోరు మీదుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలకు చెందిన చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేనప్పటికీ ఈమె చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి సక్సెస్ సాధించింది. తన తొలి చిత్రం ఏం మాయ చేశావెతో హిట్ కొట్టిన ఈమె ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆమెకు వరుసగా హిట్స్ వచ్చాయి. దీంతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
అయితే సమంతను తన కెరీర్ ప్రారంభంలో చూసి ఇప్పుడు చూస్తే ఎన్నో తేడాలు వచ్చాయని స్పష్టంగా చెప్పవచ్చు. ఆమె ముఖాన్ని సర్జరీ చేయించుకుంది. ఈ క్రమంలోనే ఒకప్పటి సమంతకు, ఇప్పటి సమంతకు చాలా తేడాలను గమనించవచ్చు. అయితే ఈమె కెరీర్ ఆరంభంలో ఎలా ఉండేదో చాలా మందికి తెలియదు. కానీ అప్పట్లో ఆమె పూర్తి భిన్నంగా ఉండేది. మొదట్లో కమర్షియల్ యాడ్స్‌లో నటించింది. తరువాత మోడల్ అయింది. ఆ తరువాత సినిమాల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె అప్పట్లో చేసిన ఓ యాడ్ తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో సమంతను చూసి.. ఆమె ఇప్పటి ఫొటోలను చూస్తే అసలు గుర్తు పట్టరాకుండా ఉంది.
ఇక సమంత అప్పట్లో ఆషిక అనే గోల్డ్ కంపెనీకి చెందిన యాడ్‌లో నటించింది. అదే యాడ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమెలో అప్పటికి, ఇప్పటికి ఎన్నో మార్పులు వచ్చాయని మనకు సులభంగా తెలిసిపోతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సమంత యశోద అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. ఈ మూవీ ఆగస్టు 11న రిలీజ్ కానుంది. అలాగే విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి అనే మూవీ చేస్తోంది. దీంతోపాటు ఈమె నటించిన శాకుంతలం అనే మూవీ కూడా త్వరలోనే రిలీజ్ కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…