Bigg Boss Telugu Season 6 : బుల్లితెరపై అత్యంత సక్సెస్ సాధించిన షోలలో బిగ్ బాస్ ఒకటి. ఈ షో 5 సీజన్లు ముగించుకుంది. త్వరలోనే 6వ సీజన్ సైతం ప్రారంభం కానుంది. ఈ మధ్యే బిగ్ బాస్ ఓటీటీని నిర్వహించారు. కానీ దీన్ని ఓటీటీకే పరిమితం చేశారు. టీవీలో ప్రసారం చేయలేదు. కనుక ఈ షోకు పెద్దగా స్పందన లభించలేదు. అయితే త్వరలో బిగ్ బాస్ సీజన్ 6ను ప్రారంభించనుండడంతో మళ్లీ బుల్లితెర ప్రేక్షకులకు కావల్సినంత వినోదం లభ్యం కానుంది. ఇక ఈ షోకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను త్వరలోనే వెల్లడించనున్నారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6ను సెప్టెంబర్‌లో ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. లేదా ఆగస్టు చివర్లో అయినా ప్రారంభం అవుతుందని సమాచారం. ప్రస్తుతం షోకు సంబంధించిన సెట్, కంటెస్టెంట్ల ఎంపిక వంటి పనులు కొనసాగుతున్నాయి. ఇక ఈ సారి షోలో పాల్గొననున్న సెలబ్రిటీల లిస్ట్ ఇదే.. అంటూ ఒక జాబితా అయితే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దాని ప్రకారం ఈ సారి షోలో పాల్గొననున్న సెలబ్రిటీల వివరాలు ఈవిధంగా ఉన్నాయి.
ఈ సారి బిగ్ బాస్ సీజన్‌లో.. యూట్యూబర్ హర్ష సాయి, యాంకర్ వర్షిని, దీపికా పిల్లి, నవ్య స్వామి, ధన్షు, చిత్ర రాణి, హైపర్ ఆది వంటి వారు పాల్గొంటారని సమాచారం. అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాబితానే. కనుక ఇందులో మార్పులు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ సారి షోలో అనసూయను కూడా తీసుకురానున్నారని తెలుస్తోంది. ఆమెకు ఇందుకు గాను రూ.1 కోటి వరకు చెల్లించేందుకు సైతం నిర్వాహకులు ముందుకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉంది.. అనేది తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…