Samantha : నాగ చైతన్య, సమంతలపై విడాకుల పుకార్లు అంతం లేనివిగా కనిపిస్తున్నాయి. ఈ పుకార్లపై ఇద్దరు నటీనటులు ఇంకా స్పందించలేదు. అభిమానులు దీని గురించి పెద్ద గందరగోళంలో ఉన్నారు. ఇప్పటికే వీరు విడిపోవడంపై అనేక కథనాలను ప్రచురిస్తున్నారు. అయితే సమంత అన్ని పుకార్లపై నిశ్శబ్దాన్ని వీడింది.

తన దుస్తుల బ్రాండ్ సాకి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా.. సమంత ప్రశ్నోత్తరాల సెషన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో సంభాషించారు. ఈ సమయంలో, ఆమె అభిమాని ఒకరు, “మీరు నిజంగా ముంబైకి వెళ్తున్నారా?” అని అడగ్గా.. తాను ఎక్కడికీ వెళ్లనని, హైదరాబాద్ తన ఇల్లు అని సమంత క్లారిటీ ఇచ్చింది.
“ఈ పుకారు ఎక్కడ మొదలైందో నాకు నిజంగా తెలియదు. కానీ, వందలాది పుకార్లు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నా ఇల్లు. ఎల్లప్పుడూ నా ఇల్లు ఇదే. హైదరాబాద్ నాకు అన్నీ ఇస్తోంది. నేను ఇక్కడ నివసిస్తూనే ఉంటాను” అని సమంత ఓ అభిమాని ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
సమంత, నాగ చైతన్య విడిపోతారని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఇటీవల జోస్యం చెప్పారు. నాగ చైతన్య స్టార్‌డమ్‌కి ఎదుగుతాడని, సమంతతో విడిపోతాడని చెప్పారు. జ్యోతిష్యుడు కూడా సమంత ముంబైకి మారవచ్చని సూచించాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విడాకుల పుకార్ల గురించి చాలా మంది అభిమానులు ఆమెను నేరుగా అడిగారు. కానీ సమంత వాటన్నింటినీ పట్టించుకోకుండా స్కిప్ చేసింది.
సమంత విడిపోవడం గురించి ఏమీ ప్రస్తావించనప్పటికీ, నాగ చైతన్యతో తన సంబంధం గురించి పరోక్షంగా “హండ్రెడ్ అదర్ రూమర్స్” అని చెప్పింది. ఇక సమంత, నాగ చైతన్య దీనిపై మరింత స్పష్టతను ఇస్తారో, లేదో చూడాలి.