Salman Khan : ఈ మధ్య మన తెలుగు సినిమాలలో బాలీవుడ్ నటులు ఎక్కువ భాగం అవుతున్నారు. పాన్ ఇండియా చిత్రాలలో బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ టాలీవుడ్ హీరోల సినిమాలలో నటిస్తున్నట్టు తెలియజేశారు. సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రం అంతిమ్. ది ఫైనల్ ట్రూత్.. అన్నది ఉపశీర్షిక. ఆయుష్ శర్మ కథానాయకుడుగా రూపొందిన ఈ చిత్రాన్ని మహేష్ మంజ్రేకర్ తెరకెక్కించారు.
రీసెంట్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా, చిత్ర బృందంతో సల్మాన్ హైదరాబాద్‌లో సందడి చేశారు. తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకొనేందుకే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చా. ఆయుష్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. నా తర్వాతి చిత్రాలన్నీ కచ్చితంగా అన్ని భాషల్లో విడుదల చేస్తా. ప్రస్తుతం హిందీలో భాయీజాన్, దబాంగ్ 4, టైగర్ 3 చిత్రాలు చేస్తున్నా. తెలుగులో చిరంజీవి గాడ్‌ఫాదర్ చిత్రంలో నటిస్తున్నా.
నా పాత్రేంటి అని నేనడగలేదు. నా సినిమాలో చేయాలని చిరు అడిగారు.. ఎన్ని రోజులు కాల్షీట్లు కావాలని మాత్రమే అడిగాను. త్వరలో వెంకటేష్‌తోనూ కలసి నటించబోతున్నా. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తానన్నారు. అంతిమ్ ప్రచారం కోసం నగరంలోని ఓ మాల్‌కు విచ్చేసిన సల్మాన్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్ నాకు ఇష్టమైన ప్రదేశం. హైదరాబాద్ రాగానే బిర్యానీ రుచి చూశా.. అని ఆయన చెప్పడం విశేషం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…