Bigg Boss 5 : ఏదేమైనా హ‌గ్గులు మాత్రం ఆపేదే లేదంటున్న సిరి, ష‌ణ్ముఖ్..!

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మంలో టికెట్ టూ ఫినాలే టాస్క్ ఎంత ఆస‌క్తికరంగా సాగుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మొద‌టి టాస్క్‌లో ఐస్ ట‌బ్‌లో కాళ్లు పెట్టి చాలా మంది గాయ‌ప‌డ్డారు. రెండో టాస్క్‌లో 29 నిమిషాలు లెక్కపెట్టాల్సి ఉండ‌గా, ఈ ఛాలెంజ్‌లో మానస్‌ మొదటి స్థానంలో నిలిచాడు. షణ్ముఖ్‌, సిరి, శ్రీరామ్‌, ప్రియాంక, కాజల్‌, సన్నీ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

అయితే ఎవ‌రెన్ని చెప్పినా తాము మాత్రం హ‌గ్ విష‌యంలో త‌గ్గేదేలే అంటున్నారు సిరి-ష‌ణ్ముఖ్‌. నన్ను బాగా చూసుకుంటున్నాడు, మరి హగ్గివ్వకపోతే ఎలా అంటూ అతడిని హత్తుకుంది సిరి. మా అమ్మకు ఇప్పుడు అర్థమవుతుందని తనలో తానే అనుకుంది సిరి.

ఇక కొంత సేప‌టి త‌ర్వాత హౌస్‌మేట్స్ స్కిల్‌ ఛాలెంజ్‌ స్వీకరించారు. ఇందులో భాగంగా ఏటవాలుగా ఉన్న స్టాండ్‌లో నీళ్లు పోసి అందులోని జార్స్‌లో ఉన్న బాల్స్‌ కింద పడేలా చేయాలి. ఎవరైతే అన్ని బాల్స్‌ ముందుగా కిందపడేలా చేస్తారో వారు మొదటి స్థానంలో నిలుస్తారు. అయితే గాయాల పాలైన శ్రీరామ్, సిరి స్థానాల‌లో ఆడ‌టానికి స‌న్నీ, ష‌ణ్ముఖ్ ముందుకు వ‌చ్చారు. టాస్క్ అనే స‌రికి సిరి కాలికి క‌ట్టుతోనే ఆడ‌డానికి వ‌చ్చింది.

బిగ్ బాస్ ఒప్పుకోక‌పోయే స‌రికి ఆమె త‌ర‌పున ష‌ణ్ముఖ్ గేమ్ ఆడాడు. ఇక ఈ గేమ్‌లో మానస్‌, శ్రీరామ్‌, సిరి, ప్రియాంక, కాజల్‌, సన్నీ, షణ్ముఖ్‌ వరుసగా ఏడు స్థానాల్లో నిలిచారు. మొత్తంగా టికెట్‌ టు ఫినాలే టాస్క్‌లో మూడు ఛాలెంజ్‌లు పూర్తయ్యే సరికి తక్కువ పాయింట్లు ఉన్న కాజల్‌, ప్రియాంక రేసు నుంచి తప్పుకున్నట్లు బిగ్‌బాస్‌ వెల్లడించాడు. సన్నీ, షణ్ముఖ్‌లిద్దరికీ సమాన పాయింట్లు రావడంతో వీరికి మళ్లీ గేమ్‌ పెట్టగా ఇందులో సన్నీ గెలిచి తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించాడు.

అందరికంటే ఎక్కువగా మానస్ 18 పాయింట్లతో ముందున్నాడు. ఆ తరువాత స్థానంలో 16 పాయింట్లతో శ్రీరామ్ ఉన్నాడు. 15 పాయింట్లతో సిరి మూడో స్థానంలో ఉంది. 10 పాయింట్లతో సన్నీ టికెట్ టు ఫినాలేకి అర్హత సాధించిన వారిలో చివరి స్థానంలో ఉన్నాడు. షణ్ను రేసు నుంచి వైదొలిగాడు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM